Lionel Messi: మెస్సి ‘బిష్ఠ్‌’కు మిలియన్‌ డాలర్ల ఆఫర్‌..!

మెస్సి(Lionel Messi) ప్రపంచకప్‌ (FIFA World Cup)ఫైనల్‌లో ధరించిన బిష్ఠ్‌కు భారీ డిమాండ్‌ వచ్చింది. ఓ లాయర్‌ రూ.8.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు.

Published : 25 Dec 2022 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌(FIFA World Cup) ఫైనల్స్‌లో విజయం తర్వాత ఖతార్‌ చక్రవరి షేక్‌ తమీమ్‌ బిన్‌ హమద్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మెస్సి(Lionel Messi)కి ‘బిష్ఠ్‌’ అనే సంప్రదాయ వస్త్రాన్ని బహూకరించారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వస్త్రం గురించి చర్చించుకున్నారు. ఇటీవల మెస్సి‘బిష్ఠ్‌’కు ఓ వ్యక్తి భారీ ఆఫర్‌ చేశారు. ఆ ‘బిష్ఠ్‌’ తనకు ఇస్తే మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఒమన్‌కు చెందిన పార్లమెంట్‌ సభ్యుడు, లాయర్‌  అహ్మద్‌ అల్‌ బర్వాని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు.

ది నేషనల్‌ పత్రికతో బర్వాని మాట్లాడుతూ.. మెస్సి(Lionel Messi) సానుకూలంగా ఉంటే అతడికి ఎంత ధర కావాలో చెప్పవచ్చని కూడా పేర్కొన్నాడు. బిష్ఠ్‌ను బహూకరిస్తున్న సమయంలో తాను దోహాలోని స్టేడియంలోనే ఉన్నట్లు తెలిపాడు. దీనిని తాను ధరించనని.. ప్రదర్శనలో ఉంచుతానన్నాడు. జీవితంలో ఏదైనా సాధ్యమే అనే సందేశం ప్రజలకు ఇచ్చేందుకు ఇది గుర్తుగా ఉంటుందని పేర్కొన్నాడు.

బిష్ఠ్‌ అరబ్‌ సంప్రదాయ వస్త్రం. దీనిని గొర్రె ఉన్ని, ఒంటె వెంట్రుకలతో కలిపి తయారు చేస్తారు. అరబ్‌ దేశాల్లో రాజులు, మతపెద్దలు ధరిస్తుంటారు. ప్రపంచకప్‌(FIFA World Cup)లో విజయం తర్వాత మెస్సి (Lionel Messi)దీనిని ధరించి కనపించడం సంచలనం సృష్టించింది. ప్రపంచకప్‌(FIFA World Cup)ను అందుకొన్న తర్వాత  ఫొటోషూట్‌ సమయానికి మెస్సి(Lionel Messi) అర్జెంటీనా జెర్సీ ధరించి వచ్చాడు. ఈ జెర్సీపై మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు అర్జెంటీనా 1978, 1986, 2022ల్లో ఫిఫా ప్రపంచకప్‌(FIFA World Cup)లు గెలిచినందుకు చిహ్నాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని