Lionel Messis: మెస్సీ బాడీ గార్డ్‌ చాలా టఫ్‌ గురూ.. ఎవరీ కండల వీరుడు

మెస్సీ బాడీ గార్డ్‌ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమయ్యాడు. అతడు ఎవరూ అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

Updated : 09 Jul 2024 19:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ మాంత్రికుడు లియోనల్‌ మెస్సీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడు. అతడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బీభత్సం. ఒక్కసారి అతడిని తాకితే చాలు అనుకునేవారు కోకొల్లలు. మ్యాచ్‌ మధ్యలో పిచ్‌పైకి మెస్సీ కోసం దూసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి అతడు మియామీ జట్టుకు ఆడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఓ ఫ్యాన్‌ దూసుకురాగా.. ఫీల్డ్‌ బయట ఉన్న మెస్సీ బాడీగార్డ్‌ ఒకరు చిరుత వేగంతో అడ్డుకొని పక్కకు తీసుకెళ్లాడు. ఇంత చురుగ్గా ఉన్న ఆ వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్‌ ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. 

అతడిపేరు యస్సీనే చ్యూకో. అమెరికా మాజీ నేవీ సీల్‌. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ యుద్ధాల్లో పాల్గొన్నాడు. అతడిని బాడీ గార్డ్‌గా పెట్టుకోవాలని ఇంటర్‌ మియామీ క్లబ్‌ అధ్యక్షుడు డేవిడ్‌ బెక్‌హామ్‌, మెస్సీకి సూచించాడు. మైదానం లోపల, వెలుపల ఫ్యాన్స్ ఎవరూ మెస్సీని తాకకుండా కాపాడటమే అతడి ప్రధాన విధి.

మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, కుటుంబంతో కలిసి షాపింగ్‌ వెళ్లే సమయంలో మెస్సీ వెన్నంటే చ్యూకో ఉంటాడు. అంతేకాదు చ్యూకోకు సోషల్‌ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు. అతడు గతంలో పలు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన ట్రైనింగ్‌, వర్కౌట్ల వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని