Lionel Messi: వేలానికి మెస్సీ వాడిన టిష్యూ.. వామ్మో! ఇంత ధరా?

లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే అతడు వినియోగించిన ఓ వస్తువును వేలం వేయడం, దానికి నిర్ణయించిన ధర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది....

Published : 20 Aug 2021 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లియోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే అతడు వినియోగించిన ఓ వస్తువును వేలం వేయడం, దానికి నిర్ణయించిన ధర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వస్తువు మరేదో కాదు.. అతడు ఈ మధ్యే వినియోగించిన ఓ టిష్యూ పేపర్‌.

బార్సిలోనా క్లబ్‌కు వీడ్కోలు పలుకుతూ మెస్సీ భావోద్వేగాని గురయ్యాడు. ఉబికివస్తున్న కన్నీటిని ఓ టిష్యూతో తుడుచుకున్నాడు. ఎలాగోలా ఆ టిష్యూ పేపర్‌ను సంపాదించిన ఓ వ్యక్తి ప్రస్తుతం దానిని వేలానికి ఉంచాడు. దాని ధరను మిలియన్‌ డాలర్లు (రూ.7.5 కోట్లు)గా నిర్ణయించాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ వినియోగించిన టిష్యూను పొందాలంటే మిలియన్‌ డాలర్లు చెల్లించాలని పేర్కొన్నాడు.

అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ సాధించాడు. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా ప్రకటించింది. మెస్సీకి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో అతడు కంటతడి పెట్టడమే కాకుండా చూస్తున్న వారినీ కన్నీళ్లు పెట్టించాడు. తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని, అత్యంత బాధాకరమైన క్షణమిదని భావోద్వేగానికి గురయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని