IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
ఈ ఐపీఎల్‌లో విజేత చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) నిలిచినప్పటికీ.. ఎక్కువ అవార్డులను మాత్రం రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ జట్టు (Gujarat Titans) ఆటగాళ్లే గెలుచుకున్నారు. మరి ఎవరెవరికి ఏ అవార్డులు దక్కాయంటే..?
ఇంటర్నెట్‌డెస్క్: నాలుగు అయిదైంది.. ముంబయి రికార్డు సమమైంది. ఐదోసారి టైటిల్(IPL 2023) గెలిచి ధోనీ సేన(chennai super kings) ఐపీఎల్‌లో మరోసారి సత్తాచాటింది. రిజర్వ్‌డే నాడు చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో చెన్నై చిరస్మరణీయ విజయాన్ని(IPL Winner 2023) నమోదు చేసింది. మహేంద్రుడి(MS Dhoni)కి అద్భుతమైన కానుకను ఆ జట్టు అందించింది. అయితే.. విజేతగా చెన్నై నిలిచినప్పటికీ.. ఈ సీజన్‌లో ఎక్కువ అవార్డులు మాత్రం గుజరాత్‌కే దక్కాయి. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ సహా పలు విభాగాల్లో అవార్డులను ఆ జట్టు ఆటగాళ్లు ఎగరేసుకుపోయారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇలా..
- విజేత : చెన్నై సూపర్ కింగ్స్
- రన్నరప్ : గుజరాత్ టైటాన్స్
- మూడో స్థానంలో నిలిచిన జట్టు : ముంబయి ఇండియన్స్
- నాలుగో స్థానంలో నిలిచిన జట్టు : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
- ఈ సీజన్ అత్యుత్తమ వేదిక : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం
- ఐపీఎల్ ఫెయిర్‌ప్లే అవార్డు : దిల్లీ క్యాపిటల్స్
- ఆరెంజ్ క్యాప్ : శుభ్‌మన్ గిల్(జీటీ) 890 పరుగులు
- పర్పుల్ క్యాప్ : మహమ్మద్ షమీ(జీటీ) 28 వికెట్లు
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది టోర్నమెంట్ : గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆర్సీబీ) (183.49)
- గేమ్ ఛేంజర్ ఆఫ్ ది టోర్నమెంట్ : శుభ్‌మన్ గిల్
- ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడు : శుభ్‌మన్ గిల్ (84)
- ఈ టోర్నమెంట్‌లో అత్యంత విలువైన ఆటగాడు : శుభ్‌మన్‌గిల్
- లాంగెస్ట్ సిక్స్ : డుప్లెసిస్ (ఆర్సీబీ) (115 మీటర్లు)
- క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ : రషీద్ ఖాన్ (జీటీ)
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా