SKY: సూర్యకుమార్‌ బలహీనతలేంటో ఒక్కరే చెప్పారు: నాజర్ హుస్సేన్

టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. విభిన్న షాట్లు కొడుతూ పరుగులు రాబెడుతున్న సూర్యకుమార్‌ బలాలు-బలహీనతలు ఏంటో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్ విశ్లేషిస్తూ అభిమానులను అడిగాడు.

Published : 10 Nov 2022 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టేస్తున్న బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. విభిన్న షాట్లతో పరుగులు రాబెడుతోన్న సూర్యకుమార్‌ బలాలు-బలహీనతలు ఏంటో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాజర్‌ హుస్సేన్ విశ్లేషిస్తూ అభిమానులను అడిగాడు. అయితే, కేవలం ఒక్క బలహీనత మాత్రమే రాగా.. 15 పాయింట్లు అతడి బలాలపైనే రావడం విశేషం. 

‘‘నేను అభిమానుల నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ బలాలు, బలహీనతల గురించి అడిగాను. నాకు దాదాపు 15 వాట్సప్ మెసేజ్‌లు సూర్య బలాలపైనే వచ్చాయి. పేస్‌ బౌలింగ్‌ బాగా ఆడతాడు, స్పిన్‌ను కూడా చక్కగా ఎదుర్కొంటాడు. నలువైపులా షాట్లు కొడతాడు, స్కూప్‌ ఎక్కువగా ఆడతాడు.. అంటూ స్పందనలు  వచ్చాయి. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా స్ట్రైక్‌రేట్‌ను కొనసాగిస్తాడని చెప్పారు. కానీ, నేను అతడి బలహీనతల గురించి అడిగినప్పుడు మాత్రం గ్రూప్‌ నుంచి స్పందన లేదు. అయితే.. ఒక్కరు మాత్రమే సూర్య బలహీనతలను తెలిపారు. లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్‌ బౌలింగ్‌లో నెమ్మదిగా ఆడతాడని.. అదొక  అతడికి ఓ వీక్‌నెస్‌ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. కానీ ఇంగ్లాండ్‌ బౌలర్లలో లియామ్‌ డాసన్ మినహా ఎవరూ లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలర్లు లేరు. అతడు కూడా రిజర్వ్‌లో ఉన్నాడు’’ అని నాజర్ హుస్సేన్ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని