T20 League: బౌండరీలు.. సిక్సర్లు.. టాప్-5లో హిట్‌మ్యాన్
టీమ్‌ఇండియాలోనే కాకుండా దేశవాళీలోనూ అతిగొప్ప బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు క్రీజులో నిలుచుంటే పరుగుల వరద పారాల్సిందే. బౌండరీల మోత మోగాల్సిందే...
టీమ్‌ఇండియాలోనే కాకుండా దేశవాళీ టీ20లీగ్‌లోనూ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు క్రీజులో నిలుచుంటే పరుగుల వరద పారాల్సిందే. బౌండరీల మోత మోగాల్సిందే. అందుకే అతడిని హిట్‌మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇక లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో ఒకడిగా కొనసాగుతున్న రోహిత్.. మరో ఘనతనూ సాధించాడు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో ప్రస్తుతం రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లీ (6,283) పరుగులతో అందరికన్నా ముందుండగా.. శిఖర్ ధావన్ (5,784), రోహిత్ (5,611) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ముగ్గురూ అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా టాప్-5 జాబితాలోనూ ఉండగా, బౌండరీలతో పాటు, అత్యధిక సిక్సులు సాధించిన టాప్-5 బ్యాట్స్మెన్ల జాబితాలో కూడా రోహిత్‌శర్మ చోటు దక్కించుకోవటం విశేషం.. మరికొద్ది రోజుల్లో టీ20 లీగ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ రెండు జాబితాల్లో ఎవరెవరు టాప్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
అత్యధిక బౌండరీల వీరులు
* శిఖర్ ధావన్: అత్యధిక బౌండరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ధావన్ నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటి వరకు 192 మ్యాచ్‌లు ఆడగా 4,567 బంతులు ఎదుర్కొని 5,784 పరుగులు చేశాడు. అందులో 654 ఫోర్లు, 124 సిక్సర్లు కొట్టాడు.
* విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. అతడు 207 మ్యాచ్‌ల్లో 4,835 బంతులు ఎదుర్కొని 6,283 పరుగులు చేశాడు. అందులో 546 ఫోర్లు, 210 సిక్సర్లు ఉన్నాయి.
* డేవిడ్ వార్నర్: ఇన్నాళ్లూ హైదరాబాద్ తరఫున ఆడి దిల్లీ జట్టుకు తరలిపోయిన డేవిడ్ వార్నర్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 3,893 బంతులు ఎదుర్కొని.. 5,449 పరుగులు చేశాడు. వాటిలో 525 బౌండరీలు, 201 సిక్సర్లు సాధించాడు.
* సురేశ్ రైనా: ఇక ఈ జాబితాలో చెన్నై మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా నాలుగో స్థానంలో నిలిచాడు. అతడు మొత్తం 205 మ్యాచ్‌ల్లో 4,402 బంతులు ఎదుర్కొని 5,528 పరుగులు చేశాడు. అతడు 506 బౌండరీలు, 203 సిక్సర్లు సాధించాడు.
* రోహిత్ శర్మ: అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్‌కు గొప్ప రికార్డు ఉంది. అతడు ఇప్పటి వరకు 213 మ్యాచ్‌లు ఆడి.. 4,303 బంతులు ఎదుర్కొని 5,611 పరుగులు చేశాడు. అందులో 491 ఫోర్లు, 227 సిక్సర్లను నమోదు చేశాడు.
అత్యధిక సిక్సర్ల ధీరులు..
* క్రిస్‌గేల్: అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ అందరికన్నా ముందున్నాడు. అతడిని ఇప్పట్లో అందుకోవడం ఎవరికైనా కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే అతడు ఇప్పటివరకు 142 మ్యాచ్‌లు ఆడి 3,333 బంతులు ఎదుర్కొని 4,965 పరుగులు చేశాడు. అందులో 405 బౌండరీలు, 357 సిక్సర్లు సాధించడం విశేషం.
* ఏబీ డివిలియర్స్: గతేడాది వరకూ బెంగళూరులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఆడిన ఏబీ డివిలియర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 184 మ్యాచ్‌ల్లో 3,403 బంతులు ఎదుర్కొని 5,162 పరుగులు చేశాడు. అందులో 413 ఫోర్లు, 251 సిక్సర్లను దంచికొట్టాడు.
* రోహిత్ శర్మ: అత్యధిక బౌండరీల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ సిక్సర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 227 సిక్సర్లు సాధించాడు. ఇదే సీజన్లో మరో 25 సిక్సర్లు సంధిస్తే డివిలియర్స్‌ను అధిగమించి రెండోస్థానంలోకి దూసుకెళ్తాడు.
* ఎంఎస్ ధోనీ: భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, మొత్తంగా నాలుగో బ్యాట్స్‌మన్‌గా నిలిచిన ఆటగాడు చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ. అతడు మొత్తం 220 మ్యాచ్‌లు ఆడి 3,494 బంతులు ఎదుర్కొని 4,746 పరుగులు చేశాడు. అందులో 325 బౌండరీలు, 219 సిక్సర్లు ఉన్నాయి.
* పొలార్డ్: ఇక ఈ జాబితాలో ముంబయి స్టార్ హిట్టర్ కీరన్ పొలార్డ్ ఐదో స్థానంలో నిలిచాడు. అతడు చాలా సీజన్లుగా ఆ జట్టుతోనే కొనసాగుతూ అత్యంత కీలక విదేశీ ఆటగాడిగా పేరుతెచ్చుకున్నాడు. మొత్తం 178 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 2,182 బంతులు ఎదుర్కొని 3,268 పరుగులు చేశాడు. అందులో 212 ఫోర్లు, 214 సిక్సర్లు సాధించాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్‌కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్