World Cup-Dhoni: అఫ్గానిస్థాన్‌ టీమ్‌ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్‌.. ధోనీ మళ్లీ పాత లుక్‌లో!

ప్రపంచకప్‌లో సత్తాచాటడం కోసం అఫ్గానిస్థాన్ జట్టు వ్యూహాలకు పదునుపెడుతోంది. భారత్‌లో పరిస్థితుల గురించి తెలిసిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా (Ajay Jadeja)ను మెంటార్‌గా నియమించుకుంది.

Updated : 03 Oct 2023 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా  వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం జట్లన్నీ భారత్‌కు చేరుకుని వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఇదిలా ఉండగా, క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌ (Afghanistan) ఈ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీ ఇవ్వాలనుకుంటోంది. ఈ క్రమంలోనే తన వ్యూహాలకు పదునుపెడుతోన్న అఫ్గాన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పరిస్థితుల గురించి తెలిసిన టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు అజయ్‌ జడేజా (Ajay Jadeja)ను మెంటార్‌గా నియమించుకుంది. భారత్‌ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడిన అజయ్‌ జడేజాను ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అక్టోబర్ 7న ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ తలపడనుంది. 

‘Rohit Sharma: ప్రపంచకప్‌ ముందు.. హిట్‌మ్యాన్‌ ప్రకంపనలు..!


మళ్లీ పాత లుక్‌లో

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni)  చాలాకాలంగా రకరకాల హెయిర్‌స్టైల్స్‌ చేయించుకుంటూ ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతున్న విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌ సమయంలో జులపాల జట్టుతో కనిపించిన ధోనీ చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. ఓ యాడ్ షూట్‌ కోసం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్‌ ఆలీమ్‌ హకీమ్‌ ధోనీకి హెయిర్‌ స్టైల్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆలీమ్‌ హకీమ్‌ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి కాస్త వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని