IPL 2023: హార్దిక్‌ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా: జాషువా లిటిల్‌

ఐర్లాండ్‌ పేసర్ జాషువా లిటిల్‌ సంచలనం సృష్టించాడు. ఆ దేశం నుంచి ఐపీఎల్‌ (ipl) లోకి అడుగు పెట్టిన తొలి బౌలర్‌గా మారాడు. గుజరాత్‌ టైటాన్స్ (gt) లిటిల్‌ను ఐపీఎల్‌ మినీ వేలంలో సొంతం చేసుకుంది.

Published : 24 Dec 2022 23:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ (ipl)లోకి అడుగుపెట్టిన మొదటి ఐర్లాండ్‌ క్రికెటర్‌గా జాషువా లిటిల్‌ నిలిచాడు. ఈ 23 ఏళ్ల ఆటగాడిని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది. లిటిల్‌ గతేడాది టీ20 లీగ్‌లో చెన్నై జట్టుకు నెట్‌ బౌలర్‌గా సేవలందించాడు. ఇటువంటి అత్యుత్తమ టీ20 లీగ్‌లో ఆడటం అద్భుత అవకాశామని  లాభదాయకమైన టీ20 లీగ్‌లో ఆడటం ఒక అద్భుతమైన అవకాశమని ఐర్లాండ్‌ పేసర్‌ లిటిల్‌ అభివర్ణించాడు. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా - కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య నాయకత్వంలో గుజరాత్‌ తరఫున ఆడే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని లిటిల్‌  తెలిపాడు. ‘‘డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్‌ జట్టుతో సంతకం చేసినందుకు సంతోషంగా ఉంది. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా నేతృత్వంలో హార్దిక్‌ సారథ్యంలో ఒక బలమైన జట్టుతో కలిసి ఆడటానికి ఎదురుచూస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు గుజరాత్‌ ఫ్రాంచైజీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

జాషువా లిటిల్‌ 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 22 వన్డేలు, 53 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్‌లో అడిలైడ్‌ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌లో లిటిల్‌ అద్భుతమైన హ్యాట్రిక్‌ సాధించాడు. 19వ ఓవర్లో వరుసగా కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ను ఔట్ చేశాడు. లిటిల్‌ అనేక ఫ్రాంచైజీ లీగ్‌లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌ ది హండ్రెడ్‌, లంక లీగ్‌ (ఎల్పీఎల్)లో ఆడాడు. ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ స్థానం సంపాదించాడు. ‘‘ఐర్లాండ్‌ క్రికెట్‌లో లిటిల్ కొన్ని సంవత్సరాలుగా కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్‌ ద్వారా అతడు కచ్చితంగా పురోగతి సాధించగలడు’’ అని ఐర్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ హోల్డ్స్‌వర్త్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని