LSG vs MI: ఒక్క నెల ఆలస్యమైనా.. నా చేతిని తీసేయాల్సిన పరిస్థితి: మోసిన్ ఖాన్
ముంబయి ఇండియన్స్‌పై లఖ్‌నవూ (LSG vs MI) విజయం సాధించడంలో మోసిన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులను కాపాడిన మోసిన్ కెరీర్ ఒక సమయంలో ప్రమాదం బారిన పడింది.
ఇంటర్నెట్ డెస్క్: మోసిన్ ఖాన్ (Mohsin Khan).. ఇప్పుడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) అభిమానుల పాలిట హీరోగా మారిపోయాడు. క్రీజ్‌లో ముంబయి హిట్టర్లు కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ఉన్నాసరే అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరం కాగా.. ఆరు బంతుల్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. ఎడమ భుజం గాయం కారణంగా దేశవాళీ క్రికెట్‌తోపాటు ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో తన చేతిని తీసేయాల్సిన పరిస్థితి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు మోసిన్ తెలిపాడు. ఈ ప్రదర్శనను తన తండ్రికి అంకితమిచ్చాడు. మ్యాచ్ జరిగిన రోజే (మంగళవారం) అతడి తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం విశేషం. దాదాపు పది రోజుల పాటు తన తండ్రి ఐసీయూలో ఉన్నట్లు మోసిన్ తెలిపాడు.
‘‘గాయపడిన రోజులను తలుచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. చాలా కష్టంగా సమయం గడిచింది. దాదాపు సంవత్సరం తర్వాత మ్యాచ్‌లను ఆడటం ప్రారంభించా. అంతేకాకుండా మా నాన్న కూడా అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రి నుంచి మంగళవారమే డిశ్చార్జి అయ్యారు. ఆయనకు ఈ ప్రదర్శనను అంకితమిస్తున్నా. మా నాన్న తప్పకుండా మ్యాచ్‌ను చూసి ఉంటారు. ఇక చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ వేయడానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వకపోయినా.. గౌతమ్ గంభీర్, విజయ్ దహియా మళ్లీ అవకాశం ఇచ్చారు. చివరి ఓవర్‌లో నా రన్నప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. స్కోరు బోర్డు వైపు చూడకుండా నాపాటికి నేను బౌలింగ్ చేశా. ఆరు బంతులను ఉత్తమంగా వేయాలనే లక్ష్యంతోనే వేశా.
నా ఎడమ చేతి భుజం వద్ద రక్తం గడ్డకట్టడంతో చాలా ఇబ్బంది పడ్డా. ఏడాదిపాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కనీసం చేతిని పైకి కూడా ఎత్తలేకపోయా. బౌలింగ్‌ను మర్చిపోయా. చేతిని సరిచేయడానికి నా ఫిజియో తీవ్రంగా కృషి చేశాడు. ట్రీట్‌మెంట్‌కు ఒక్క నెల రోజులు ఆలస్యమైనా సరే నా చేతిని తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదని వైద్యులు చెప్పారు. నేను ఆ గాయం వల్ల పడిన బాధను మరో క్రికెటర్ పడకూదని కోరుకుంటా. నా నరాలు బ్లాక్ కావడంతో రక్తప్రసరణ సరిగా జరగలేదు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో రాజీవ్ శుక్లా, ఎల్ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా, నా కుటుంబ సభ్యులు చాలా మద్దతుగా నిలిచారు. అయినా, ఇప్పటికీ గాయం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నా. చివరి ఓవర్ వేయడం అంటే మరింత ఒత్తిడి ఉంటుంది. ప్రాక్టీస్ సందర్భంగా నేను చేసిన దానినే మ్యాచ్‌లోనూ అమలు చేశా. మా కెప్టెన్‌తో కూడా ఇదే విషయం చెప్పా’’ అని మోసిన్ తెలిపాడు. తాను వేసిన మూడు ఓవర్లలో వికెట్ తీసిన మోసిన్ 26 పరుగులను ఇచ్చాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు
-
Sports News
సాకర్ బాటలో క్రికెట్!.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్