LSG vs DC: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
బలాల పరంగా రెండు జట్లూ సమాన స్థాయిలో ఉన్నాయి. అయితే వీటిలో ఎవరు విజేతగా నిలుస్తారనేది తెలియాలంటే మరికాసేపు వేచి చూడాలి. ఇంతకీ ఆ రెండు ఏంటంటే జట్లు దిల్లీ, లఖ్‌నవూ.
ఇంటర్నెట్ డెస్క్: వీకెండ్ సందర్భంగా డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లను అందించేందుకు ఐపీఎల్ (IPL 2023) సిద్ధమైపోయింది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ పంజాబ్ x కోల్‌కతా జట్ల మధ్య జరుగుతోంది. ఇక రాత్రి 7.30గంటలకు లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ - దిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) జట్ల మధ్య లఖ్‌నవూ వేదికగా ప్రారంభం కానుంది. రెండు జట్లూ పటిష్ఠంగా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో పై చేయి కేఎల్ సేనదా..? డేవిడ్ వార్నర్ జట్టుదో తెలియాలంటే వేచి చూడాలి. ఈ లోగా జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం..
టోర్నీలో రాణించడం రాహుల్‌కు అవసరం.. (KL Rahul)
ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్.. ఒకానొక సమయంలో జట్టులో నుంచి పక్కకు వైదొలగాల్సిన పరిస్థితి ఎదురైంది. మళ్లీ జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలంటే మాత్రం ఈ లీగ్‌లో కేఎల్ రాహుల్ రాణించాల్సిన అవసరం ఉంది. సారథిగా జట్టును అద్భుతంగా నడిపించినా.. ఆటగాడిగా పరుగులు చేయాల్సిందే. ఇక జట్టు పరంగా లఖ్‌నవూ పటిష్ఠంగానే ఉంది. కేఎల్, క్వింటన్ డికాక్, మార్నస్ స్టొయినిస్, దీపక్ హుడాతోపాటు మినీ వేలంలో భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన నికోలస్ పూరన్, కేల్ మయేర్స్ బ్యాటింగ్‌లో కీలకమవుతారు. యువ బ్యాటర్ ఆయుష్ బదోనీ గతేడాది ఫామ్‌ను కొనసాగించాలి. బౌలింగ్‌లో జయ్‌దేవ్ ఉనద్కత్, అవేశ్ ఖాన్, మార్క్‌వుడ్‌తో కూడిన పేస్ దళం అద్భుతంగా ఉంది. స్పిన్ భారమంతా రవి బిష్ణోయ్‌పైనే ఆధారపడి ఉంది.
రిషభ్ లేకపోయినా.. (Rishabh Pant)
దిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆసీస్ టాప్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు దిల్లీ ఫ్రాంచైజీ బాధ్యతలను అప్పగించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అనుభవంతో వార్నర్ దిల్లీని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల భారత్‌పై వన్డే సిరీస్‌లో అదరగొట్టిన మిచెల్ మార్ష్ తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. యువ బ్యాటర్ పృథ్వీ షా ఈ మెగా టోర్నీలో రాణించి భారత జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. ఫిలిప్ సాల్ట్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకుని రొసోవ్‌ను అదనపు బ్యాటర్‌గానూ ఎంచుకొనే అవకాశం ఉంది. హార్డ్‌హిట్టర్ రోవ్‌మన్ పావెల్ గత సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. కుల్‌దీప్, అక్షర్ పటేల్ స్పిన్ విభాగంతోపాటు ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ పేస్ దాడిని కొనసాగిస్తారు.
తుది జట్లు (అంచనా):
లఖ్‌నవూ: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కేల్ మయేర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జయ్‌దేవ్ ఉనద్కత్, మార్క్‌వుడ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
దిల్లీ: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, ఫిలిప్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్