Hyderabad vs Lucknow: హైదరాబాద్.. ప్చ్!
ఘోర పరాజయంతో టీ20 క్రికెట్ లీగ్‌ను ఆరంభించిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో మెరుగుపడింది. కానీ ఏం లాభం? మ్యాచ్ మాత్రం గెలవలేదు. బంతితో మ్యాచ్‌ను గొప్పగా మొదలుపెట్టినా.. మధ్యలో పట్టువిడవడం, బ్యాటింగ్‌లోనూ
మళ్లీ తప్పని ఓటమి
త్రిపాఠి, పూరన్ పోరాటం వృథా
మెరిసిన రాహుల్, హుడా, అవేష్
లఖ్‌నవూకు రెండో విజయం
ఘోర పరాజయంతో టీ20 క్రికెట్ లీగ్‌ను ఆరంభించిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో మెరుగుపడింది. కానీ ఏం లాభం? మ్యాచ్ మాత్రం గెలవలేదు. బంతితో మ్యాచ్‌ను గొప్పగా మొదలుపెట్టినా.. మధ్యలో పట్టువిడవడం, బ్యాటింగ్‌లోనూ ఒక దశలో మెరుగైన స్థితిలోనే నిలిచినా.. ఆఖర్లో తడబడడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ప్రతికూల పరిస్థితుల్లో పుంజుకున్న లఖ్‌నవూ సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ముంబయి
టీ20 క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడగా.. లఖ్‌నవూ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట కెప్టెన్ కేఎల్ రాహుల్ (68; 50 బంతుల్లో 6×4, 1×6), దీపక్ హుడా (51; 33 బంతుల్లో 3×4, 3×6) ప్రతికూల పరిస్థితుల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో లఖ్‌నవూ 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/28), నటరాజన్ (2/26), రొమారియో షెఫర్డ్ (2/42) రాణించారు. అనంతరం హైదరాబాద్ 9 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. అవేష్ ఖాన్ (4/24), కృనాల్ పాండ్య (2/27), హోల్డర్ (3/34) ఆ జట్టును కట్టడి చేశారు. రాహుల్ త్రిపాఠి (44; 30 బంతుల్లో 5×4, 1×6), పూరన్ (34; 24 బంతుల్లో 3×4, 2×6) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
అవేష్.. మొదట్లో, చివర్లో
ఛేదనలో హైదరాబాద్ గట్టిగానే ప్రయత్నించినా.. అవేష్ ఖాన్ ఆరంభంలో, చివర్లో ఆ జట్టును గట్టి దెబ్బ తీసి లఖ్‌నవూను గెలిపించుకున్నాడు. తన తొలి ఓవర్లోనే అవేష్.. హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ (16)ను ఔట్ చేశాడ[ు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన విలియమ్సన్.. వికెట్ల వెనుక స్కూప్ షాట్ ఆడబోయి టైకి దొరికిపోయాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ (13) వైఫల్యాన్ని కొనసాగిస్తూ అవేష్ బౌలింగ్‌లోనే ఒక పేలవ షాట్ ఆడి వెనుదిరిగాడు. ఈ దశలో రాహుల్ త్రిపాఠి అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటికే జోరందుకున్న అతను.. భారీ షాట్లతో వేగంగా లక్ష్యాన్ని కరిగిస్తూ వెళ్లాడు. అయితే కృనాల్ పాండ్య.. తక్కువ వ్యవధిలో మార్క్రమ్ (12), త్రిపాఠిలను ఔట్ చేసి హైదరాబాద్‌ను దెబ్బ కొట్టాడు. అయినప్పటికీ పూరన్ ధాటిగా ఆడి జట్టును పోటీలో నిలిపాడు. చివరి 3 ఓవర్లలో హైదరాబాద్ 33 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ తన చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన అవేష్ మళ్లీ హైదరాబాద్‌ను దెబ్బ కొట్టాడు. తొలి బంతికి సిక్స్ ఇచ్చినా తొణకకుండా వరుస బంతుల్లో పూరన్, సమద్ (0)లను ఔట్ చేశాడు. అయినప్పటికీ సుందర్ (18), షెఫర్డ్ క్రీజులో ఉండటంతో హైదరాబాద్ గెలుపుపై ఆశతోనే ఉంది. కానీ హోల్డర్ చివరి ఓవర్లో 3 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయడంతో మ్యాచ్ లఖ్‌నవూ సొంతమైంది.
నిలిచిన రాహుల్, హుడా
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూకు ఆరంభంలో గట్టి ఎదురు దెబ్బలు తగిలినా పుంజుకుని మెరుగైన స్కోరు సాధించింది. స్పిన్నర్ సుందర్ ఆ జట్టుకు వరుస ఓవర్లలో రెండు షాకులిచ్చాడు. గత మ్యాచ్‌లో అదరగొట్టిన డికాక్ (1), లూయిస్ (1)లను ఔట్ చేశాడు. డికాక్ షార్ట్ ఎక్స్ట్రా కవర్లో విలియమ్సన్ పట్టిన చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగితే.. లూయిస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రెండు షాట్లు ఆడి ఊపు మీద కనిపించిన మనీష్ పాండే (11) షెఫర్డ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో పవర్ ప్లే ముగిసేసరికి లఖ్‌నవూ 32/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, దీపక్ హుడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నం చేశారు. రాహుల్ గేర్ మార్చడానికి కాస్త ఆలస్యమైనా.. 18 ఓవర్ల వరకు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. హుడా కుదురుకున్నాక బ్యాట్‌కు పని చెప్పాడు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్‌ను అతను లక్ష్యంగా చేసుకున్నాడు. అతను తన చివరి 2 ఓవర్లలో హుడా, రాహుల్‌ల ధాటికి 36 పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లకు 48/3తో ఉన్న లఖ్‌నవూ.. 15 ఓవర్లకు 114/3తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో హుడా ఔటైనా.. రాహుల్ జోరు కొనసాగించడం, బదోని (19) కూడా ధాటిగా ఆడటంతో మంచి స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!