మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?

మొతేరా స్పిన్‌ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్‌ లైయన్‌ తీవ్రంగా ఖండించాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తక్కువ పరుగులకు ఆలౌటైన సందర్భాల్లో పిచ్‌ గురించి...

Published : 01 Mar 2021 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్: మొతేరా స్పిన్‌ పిచ్‌పై వస్తున్న విమర్శలను ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్‌ లైయన్‌ తీవ్రంగా ఖండించాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తక్కువ పరుగులకు ఆలౌటైన సందర్భాల్లో పిచ్‌ గురించి ఎందుకు విమర్శలు చేయలేదని ప్రశ్నించాడు. మొతేరా వేదికగా భారత్×ఇంగ్లాండ్ మధ్య జరిగిన డే/నైటె టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ పది వికెట్ల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇంగ్లాండ్ మాజీలు పిచ్‌పై విమర్శలు చేస్తున్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా సీమ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడిన సందర్భాల్లో 47, 60 పరుగులకే ఆలౌటయ్యాం. కానీ అప్పుడు ఎవరూ పిచ్‌ గురించి మాట్లాడలేదు. కానీ ఆది నుంచే స్పిన్‌కు అనుకూలిస్తే అందరూ ఏడుస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది ఎంతో వినోదంగా ఉంది. భారత్‌×ఇంగ్లాడ్‌ మ్యాచంతా చూశాను. ఎంతో అద్భుతంగా సాగింది. అయితే ఇంగ్లాండ్ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం గమనార్హం. మొతేరా పిచ్‌ క్యురేటర్‌ను సిడ్నీ పిచ్‌కు తీసుకురావాలనిపిస్తుంది’’ అని లైయన్ పేర్కొన్నాడు. కాగా, మార్చి 4 నుంచి మొతేరా వేదికగానే భారత్×ఇంగ్లాండ్ మధ్య ఆఖరి టెస్టు జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని