- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Ranji Trophy: మధ్యప్రదేశ్ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
(ట్విటర్ సౌజన్యంతో..)
బెంగళూరు: దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్(Madhya pradesh) సత్తాచాటింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ఆ రాష్ట్ర క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. క్రికెట్‌కు పవర్‌హౌస్‌లాంటి ముంబయి జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబయిను 269 పరుగులకు కట్టడి చేసి, 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కోచ్ చంద్రకాంత్ పండిట్‌కు ఇది ఆరో నేషనల్ టైటిల్.
మ్యాచ్ సాగిందిలా..!
ఈ ఏడాది రంజీ సెమీ ఫైనల్లో బెంగాల్‌ను ఓడించి మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ను కట్టడి చేసి ముంబయి జట్టు ఫైనల్‌కు చేరాయి. జూన్ 22న మొదలైన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్ 134 (234 బంతుల్లో 13×4; 2×6) సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్స్ తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓపెనర్ యశ్ దూబే 133 (336 బంతుల్లో 14×4) సహా శుభమ్ శర్మ 116 (215 బంతుల్లో 15×4; 1×6) రజిత్ పాటిదార్ 122 (219 బంతుల్లో 20×4) సెంచరీలతో అదరగొట్టగా, చివర్లో శరన్ష్ జైన్(57) అర్ధశతకంతో రాణించడంతో మధ్యప్రదేశ్ 536 పరుగుల భారీ స్కోరు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి మరోసారి పేలవ ప్రదర్శనతో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 108 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడమే కాకుండా తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శుభమ్ శర్మ ఎంపికగా, ఈ సీజన్లో 1000 పరుగులకు పైగా చేసిన సర్ఫరాజ్‌ఖాన్ (ముంబయి) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
(ట్విటర్ సౌజన్యంతో..)
కన్నీటి పర్యంతమైన కోచ్ రవిచంద్రకాంత్ పండిత్
మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోచ్ రవి చంద్రకాంత్ పండిత్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. 1999లో ఆయన మధ్యప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయారు. దాదాపు 23ఏళ్ల తర్వాత చంద్రకాంత్ కోచ్‌గా వ్యవహరించిన మధ్యప్రదేశ్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంతో స్టేడియంలోనే భావోద్వేగానికి గురయ్యారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Bhadrachalam: రాములోరి భూమిలో భారీ ఆక్రమణకు ప్రయత్నం
-
General News
Hyderabad Metro: ఆ సమయంలో ఎక్కడి మెట్రో రైలు అక్కడే..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Assembly: అసెంబ్లీలో చర్చంతా.. ఆ ముఖ్య అధికారిపైనే!
-
Ts-top-news News
Tamilisai: అరగంట ఎదురుచూశాం.. కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్ తమిళిసై
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Jagan and Chandrababu: పలకరించుకోని జగన్, చంద్రబాబు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16/08/2022)
- స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Umran Malik : ఉమ్రాన్ మాలిక్ అరుదైన బౌలర్.. అయితే అలా చేయడం నాకు నచ్చదు!
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?