IND vs ENG: టీమ్‌ఇండియా అశ్విన్‌ను పక్కన పెట్టడం పిచ్చితనమే.!

సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ని పక్కన పెట్టడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓవల్‌లో ఈరోజు ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్వల్పమార్పులతో బరిలోకి దిగాడు. పేసర్లు మహమ్మద్ షమి, ఇషాంత్‌ శర్మలకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానాల్లో ఉమేశ్ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌లను జట్టులోకి తీసుకున్నాడు.

Updated : 02 Sep 2021 21:15 IST

 

ఇంటర్నెట్‌ డెస్కు: సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ని పక్కన పెట్టడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓవల్‌లో ఈరోజు ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జట్టులో స్వల్పమార్పులతో బరిలోకి దిగాడు. పేసర్లు మహమ్మద్ షమి, ఇషాంత్‌ శర్మలకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానాల్లో ఉమేశ్ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌లను జట్టులోకి తీసుకున్నాడు. అయితే, ఇటీవల కౌంటీ క్రికెట్లో 6 వికెట్లతో అదరగొట్టిన స్పిన్నర్‌ అశ్విన్‌కి తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరికొందరు విరాట్‌ నిర్ణయంపై ఈ విధంగా ట్వీట్‌ చేశారు. 

‘అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 413 వికెట్లు, 5 శతకాలు బాదిన అశ్విన్ పక్కన పెట్టడం పిచ్చితనమే’ -ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌

‘ఓవల్‌ టెస్టులో అశ్విన్‌కి కచ్చితంగా చోటు కల్పిస్తారనుకున్నా. కానీ, కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయంతో నిరాశ చెందాను’ -ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే

‘కౌంటీ క్రికెట్లో అదరగొట్టిన అశ్విన్‌ని నాలుగో టెస్టులో ఆడిస్తారనుకున్నా. అయితే, అతడిని పక్కన పెట్టడంపై కొంచెం ఆశ్చర్యానికి గురయ్యా’ -కామెంటేటర్‌ అలెన్‌ విల్కిన్స్‌

‘స్పిన్‌కు అనుకూలించే ఓవల్ మైదానంలో అశ్విన్‌కు చోటు కల్పించకపోవడాన్ని నమ్మలేకపోతున్నా. ప్రపంచంలోని ఐదుగురు అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్‌ కచ్చితంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటాడు. మంచి ఫామ్‌లో ఉన్న మహమ్మద్ షమిని కూడా పక్కన పెట్టారు. మీకేమైనా ఓడిపోవాలనుందా.!’ -కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని