MCC : క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. అయితే ఆచరణలోకి ఇప్పుడే కాదు!

క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ లా నిబంధనల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) కీలక మార్పులు...

Published : 09 Mar 2022 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ లా నిబంధనల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) కీలక మార్పులు చేసింది. మన్కడ్‌, లాలాజలం రుద్దడం, కొత్త బ్యాటర్‌ ఎటువైపు బ్యాటింగ్‌ చేయాలనే రూల్స్‌ను మార్చింది. అయితే, ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్‌ వరకు అమల్లోకి రావు. ఈలోగా అంతర్జాతీయంగా అంపైర్లు, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వనుంది. ‘‘2017లో క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ ది లా పబ్లికేషన్‌ నుంచి ఆటలో పెనుమార్పులు వచ్చాయి. అలానే రెండో ఎడిషన్‌ను 2019లో పబ్లిష్ చేసినప్పుడు అన్నింటికీ వివరణ ఇవ్వడంతోపాటు సవరణలు చేశాం. అయితే 2022 ఎడిషన్‌ వచ్చేనాటికి పెద్ద మార్పులు తీసుకొచ్చాం’’ అని ఎంసీసీ లా మేనేజర్‌ ఫ్రాజర్‌ స్టీవర్ట్‌ వెల్లడించారు. 

కీలక మార్పులు ఇవీ..

  • ఇప్పటి వరకు అన్‌ఫెయిర్‌ ప్లే విభాగంలో ఉన్న ‘మన్కడ్‌’ ఔట్ విధానం ఇక నుంచి రనౌట్‌ కేటగిరీలోకి మారింది. 
  • బంతి మెరుపు కోసం లాలాజలం, చెమటను రుద్దడం వంటి చర్యలపై శాశ్వతంగా నిషేధం
  • ఆటగాడు క్యాచ్‌ ఔట్‌ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చే కొత్త బ్యాటర్‌ స్ట్రైకింగ్‌ చేయాల్సి ఉంటుంది. క్యాచ్‌ అందుకునే సమయానికి ఔటైన బ్యాటర్‌ సగం పిచ్‌ దాటినా కూడా ఇదే వర్తించనుంది. అయితే ఓవర్‌ పూర్తి కాకుండా ఉన్నప్పుడు మాత్రమే. 
  • నిబంధనలు 27.4, 28.6 ప్రకారం బౌలింగ్‌ చేసేటప్పుడు ఎవరైనా ఫీల్డర్ అనైతికంగా కదిలితే ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించేవారు. బ్యాటర్‌ మంచి షాట్ కొట్టినా రద్దు చేయాల్సి వచ్చేది. ఇక నుంచి దానికి బ్యాటింగ్‌ వైపు జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వనున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని