WPL: ఇక భారత్‌లో చాలామంది తమ కుమార్తెలను క్రికెట్ వైపు ప్రోత్సహిస్తారు: మాజీ క్రికెటర్
మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ ఉండదని అంతా భావిస్తుంటారు. అయితే బీసీసీఐ (BCCI) నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజీల బిడ్డింగ్ ప్రక్రియలో రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో మహిళా క్రికెట్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని పాక్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో చాలా మంది తమ కుమార్తెలను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తెలిపాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజీల కోసం భారీ మొత్తం వెచ్చించడంతో భట్ ఇలా వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. మహిళల క్రికెట్ ముఖచిత్రం మారిపోవడం ఖాయమని పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరిన్ని వెలుగులు విరజిమ్ముతాయని తెలిపాడు.
ఐపీఎల్ (IPL) ప్రారంభ సీజన్ కంటే ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) హక్కుల కోసం భారీ మొత్తం వెచ్చించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందని భట్ చెప్పాడు. ‘‘మహిళా క్రికెట్ ముఖచిత్రం తప్పకుండా మారిపోతుంది. సరికొత్త శిఖరాలకు చేరే అవకాశం ఉంది. ప్లేయర్ల కోసం చాలా అవకాశాలు వస్తాయి. ఇక నుంచి భారత్‌లో చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రికెట్ వైపు ప్రోత్సహిస్తారని భావిస్తున్నా. ఇలాంటి ముందు అడుగును టీమ్‌ఇండియా తీసుకోవడం అద్భుతం. మరే దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహసించదు. క్రికెటర్లతోపాటు బీసీసీఐకి ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే టెలివిజన్ హక్కులను కూడా విక్రయించిన విషయం తెలిసిందే. అందరి కళ్లూ ఈ టోర్నమెంట్‌పై ఉంటాయి’’ అని భట్ వెల్లడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virender Sehwag : అప్పుడు దాన్ని తప్పనిసరి చేసిఉంటే.. చాలా మంది దిగ్గజాలు ఫెయిలై ఉండేవాళ్లు : సెహ్వాగ్
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగమార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్