T20 World Cup: ప్రపంచకప్‌లో ఆ ఇద్దరు అత్యధిక వికెట్లు తీస్తారు..!

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి.........

Published : 29 Sep 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. ఇందుకోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మెగా టోర్నీలో ఎవరు ఉత్తమంగా రాణించించగలరో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ మార్క్‌వా అంచనా వేశారు. పాకిస్థాన్‌కు చెందిన షహీన్‌ షా అఫ్రిదితోపాటు భారత స్టార్ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అత్యధిక వికెట్లు తీస్తారని అతడు పేర్కొన్నాడు. పవర్‌ ప్లేతోపాటు డెత్‌ ఓవర్లలో ఒకే సామర్థ్యంతో బౌలింగ్‌ చేయగల సత్తా బుమ్రాకి ఉందని కొనియాడాడు.

‘అన్ని ఫార్మాట్లలో బుమ్రా అత్యుత్తమ ప్లేయర్‌. టీ20 క్రికెట్‌లో వికెట్లు సాధించడంలో అతడు మరింత కీలకం కానున్నాడు. పవర్‌ ప్లేలో, ఆపై డెత్‌ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్‌ చేయగలడు’ అని పేర్కొన్నాడు. అఫ్రిదిని సైతం మార్క్‌వా ప్రశంసించాడు. పాక్‌ బౌలింగ్ దళాన్ని అతడు ముందుండి నడిపించగలడని, కుడిచేతి వాటం బ్యాటర్లను తన ఇన్‌స్వింగ్‌లతో ఇబ్బందిపెట్టగలడని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరితోపాటు అఫ్గానిస్థాన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సైతం టాప్‌-5లో ఉంటారని జోస్యం చెప్పాడు. ఇకపోతే ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేస్తాడని మార్క్‌వా అంచనా వేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని