Mary Kom: అమ్మగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువు. మొన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్‌లో బిజీబిజీగా గడిపిన భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ ఇప్పుడు తన మగ కవల పిల్లలకు బ్యాడ్మింటన్‌ నేర్పించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఆడుతున్న వీడియోని ట్వీట్‌ చేస్తూ.. ‘‘నా ఇద్దరి కొడుకులతో బాడ్మింటన్ ఆడుతున్నా. ఆ ఆటలో నాకంత ప్రావిణ్యం లేకపోయినప్పటికీ..వారితో ఆడుతున్నా. ఎప్పుడైనా సరే పిల్లలు వెళ్లాల్సిన మార్గంలో శిక్షణ ఇవ్వాలి’’ అంటూ ఓ అమ్మగా తాను నిర్వర్తించే బాధ్యతను ట్విటర్‌లో పంచుకున్నారు.  

Published : 16 Sep 2021 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువు. మొన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్‌లో బిజీబిజీగా గడిపిన భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ ఇప్పుడు తన మగ కవల పిల్లలకు బ్యాడ్మింటన్‌ నేర్పించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఆడుతున్న వీడియోని ట్వీట్‌ చేస్తూ.. ‘‘నా ఇద్దరి కొడుకులతో బాడ్మింటన్ ఆడుతున్నా. ఆ ఆటలో నేర్పు లేకపోయినప్పటికీ..వారితో ఆడుతున్నా. ఎప్పుడైనా సరే పిల్లలు వెళ్లాల్సిన మార్గంలో శిక్షణ ఇవ్వాలి’’ అంటూ ఓ అమ్మగా తాను నిర్వర్తించే బాధ్యతను ట్విటర్‌లో పంచుకున్నారు.  2000లో ఫుట్‌బాల్‌ ఆటగాడు కరుంగ్ ఆంఖోలర్ ను వివాహం చేసుకున్నామె... 2007లో ఇద్దరు మగ కవల పిల్లలు, 2013లో మగబిడ్డకు జన్మిచ్చారు. 2018లో ఆ దంపతులిద్దరూ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించారు మేరీకోమ్‌. బాక్సింగ్‌ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గానూ భారత ప్రభుత్వం నుంచి... 2006లో పద్శశ్రీ, 2013లో పద్శభూషణ్‌, 2020లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని