GGT vs MIW: హాఫ్‌ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్‌.. గుజరాత్‌ ముందు భారీ లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌తో తలపడిన మ్యాచ్‌లో ముంబయి అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌సేన భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Updated : 04 Mar 2023 21:41 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి మ్యాచ్‌లో భాగంగా గుజరాత్‌తో తలపడుతున్న ముంబయి ఇన్నింగ్స్‌ పూర్తయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో హర్మన్‌ (65) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. మాథ్యూస్‌ (47), అమిలియా (45*) కూడా రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో స్నేహ్‌రాణా రెండు వికెట్లు పడగొట్టగా.. గార్డ్‌నర్‌, తనుజా, జార్జియా తలో వికెట్‌ తీశారు.

అదరగొట్టిన హర్మన్‌..

ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (47) జట్టుకి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. మరో ఓపెనర్‌ యాస్తికా భాటియా (1) నిరాశపరిచినా.. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అనంతరం నాట్‌ సీవర్‌ (23) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 9.6 ఓవర్లలో గార్డ్‌నర్‌ బౌలింగ్‌లో హాఫ్‌ సెంచరీకి చేరువలో 47 పరుగుల వద్ద బౌల్డ్‌ అయ్యింది. తర్వాత వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ (65) బౌలర్లపై విరుచుకుపడింది. కేవలం 26 బంతుల్లోనే 60 పరుగులు చేసింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో తన తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని