T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం!

టీ20 ప్రపంచ కప్‌ 2024 (T20 World Cup 2024)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం తెరపైకి వచ్చింది.

Updated : 18 Jun 2024 18:08 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ 2024 (T20 World Cup 2024)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం తెరపైకి వచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం కెన్యా మాజీ క్రికెటర్ ఉగాండా (Uganda) జట్టు ఆటగాడిని సంప్రదించాడట. ఈ విషయాన్ని ఉగాండా ఆటగాడు వెంటనే ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేసినట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్‌లో గయానాలో ఉగాండా మూడు లీగ్ దశ మ్యాచ్‌లు ఆడింది. అప్పుడు కెన్యా మాజీ పేసర్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం పలుమార్లు వేర్వేరు నంబర్లతో ఉగాండా ప్లేయర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాడట. ఈ విషయాన్ని సదరు ప్లేయర్ ఐసీసీ అవినీతి నిరోధక బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

‘‘ఫిక్సింగ్‌ చేయాలనుకున్న వ్యక్తి ఉగాండా ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. పెద్ద జట్ల ఆటగాళ్లతో పోలిస్తే అసోసియేట్ దేశాల ప్లేయర్స్‌ని వలలో వేసుకోవడం తేలిక. కానీ, ఉగాండా ఆటగాడు వీలైనంత తొందరగా ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేసి మంచి పని చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపడతాం’’ అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్‌ సిలో ఉన్న ఉగాండా.. నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని