IND vs NZ: ఈ మ్యాచ్‌ ఫలితాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు : ఇంజమామ్‌

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఆఖరిరోజు.. టీమ్ఇండియా రెండు సెషన్లలోనే మ్యాచ్‌ను ముగిస్తుందనుకున్నానని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ అన్నాడు. భారత్‌ కివీస్‌ను ఆలౌట్..

Published : 01 Dec 2021 01:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు ఆఖరిరోజు.. టీమ్ఇండియా రెండు సెషన్లలోనే మ్యాచ్‌ను ముగిస్తుందనుకున్నానని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ అన్నాడు. భారత్‌ కివీస్‌ను ఆలౌట్ చేయలేకపోవడం నిరాశపరిచిందని.. ఆఖరి సెషన్‌ వరకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కొనసాగిస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. అందుకే ఈ మ్యాచ్‌ ఫలితాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని అన్నాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

‘ఈ మ్యాచ్‌ ఫలితాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. న్యూజిలాండ్ గొప్పగా పోరాడిందనాలా.? లేక టీమ్‌ఇండియాను దురదృష్టం వెంటాడిందనలా.? నాలుగోరోజు ఆటను బట్టి చూస్తే న్యూజిలాండ్‌కు గెలిచే అవకాశాలు లేవనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆఖరిరోజు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడమనేది చాలా కష్టం. అయితే, కివీస్‌ ఆటగాళ్ల అసాధారణ పోరాట పటిమను ప్రశంసించాల్సిందే. పటిష్టమైన బౌలింగ్‌ దళమున్న టీమ్‌ఇండియా తొలి రెండు సెషన్లలోనే మ్యాచ్‌ను ముగిస్తుందనుకున్నాను. భారత్‌కిది నిరాశ కలిగించే ఫలితమే’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు.

 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు