Riyan Parag : పరాగ్‌.. అలా చేయడం సరైనదిగా అనిపించడం లేదు: మ్యాథ్యూ హేడెన్‌

 రాజస్థాన్‌ యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సంయమనంతో వ్యవహరించాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ సూచించాడు. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో...

Published : 18 May 2022 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాజస్థాన్‌ యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ సంయమనంతో వ్యవహరించాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్‌ సూచించాడు. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో స్టొయినిస్‌ క్యాచ్‌ పట్టిన తర్వాత పరాగ్‌ సంబరాలు చేసుకున్న విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌కు హేడెన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మెక్‌కాయ్‌ బౌలింగ్‌లో (19వ ఓవర్‌) మార్కస్‌ స్టొయినిస్‌ భారీ షాట్ కొట్టగా రియాన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే రిప్లేలో నాటౌట్‌గా తేలింది. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మరోసారి స్టొయినిస్‌ కొట్టిన బంతి గాల్లోకి లేచింది. రియాన్‌ పరాగ్‌ అలవోకగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే బంతిని అందుకుని నేలను తాకలేదని చెప్పేలా సంబరాలు చేసుకున్నాడు. దీనిపై మ్యాథ్యూ హేడెన్‌ స్పందించాడు. 

‘‘యువ క్రికెటర్‌కు కొన్ని సూచనలిస్తున్నా. క్రికెట్‌ అనేది సుదీర్ఘమైన గేమ్‌. ఎన్నో జ్ఞాపకాలను పొందుపరుచుకుంటాం. విధిని ఎప్పుడూ ప్రలోభ పెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకే తగులుతుంది’’ అని హేడెన్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ 13 క్యాచ్‌లను అందుకున్నాడు. లోయర్‌ఆర్డర్‌లో వచ్చి విలువైన పరుగులనూ చేశాడు. 13 మ్యాచుల్లో 154 పరుగులను సాధించాడు. మరోవైపు లఖ్‌నవూపై రాజస్థాన్‌ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఆఖరి మ్యాచ్‌లోనూ చెన్నైపై విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని