ఆస్ట్రేలియా స్పిన్నర్‌కు జడేజా చిట్కాలు

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా స్పిన్నర్‌ మాట్‌ కుహ్నెమాన్‌కు ఆటపరంగా కొన్ని చిట్కాలు నేర్పించాడు.

Published : 15 Mar 2023 18:47 IST

IND vs AUS:  భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తనకు ఆటపరంగా మంచి చిట్కాలు చెప్పినట్టు ఆస్ట్రేలియా ఎడమ చేతి స్పిన్నర్‌ మాట్‌ కుహ్నెమాన్‌ తెలిపాడు. భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ అనంతరం జడేజా తన వాగ్దానానికి కట్టుబడి అతడితో 15 నిమిషాలు మాట్లాడినట్టు చెప్పాడు. 

 ‘‘ దాదాపు 15 నిమిషాల పాటు మేమిద్దరం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం.  భవిష్యత్తులో భారత్‌లో ఆడబోయే మ్యాచ్‌ల కోసం  జడేజా  మంచి చిట్కాలు చెప్పాడు. విజయం సాధించే తిరిగి ఇంటికి వెళ్లాలని సూచనలు చేశాడు. సిరీస్‌లో అతడి అద్భుత ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు చాలా మంచి వ్యక్తి. నాకు ఇన్‌స్టాలో మెసేజ్‌ కూడా చేశాడు. అతడు నాకు సూచనలివ్వడం నిజంగా గొప్ప విషయం. మా ఇద్దరి మధ్య ఈ సమావేశాన్ని నాథన్‌ లైయన్‌  ఏర్పాటుచేశాడు. అంతా చాలా ప్రశాంతంగా జరిగింది’’ అని కుహ్నెమాన్‌ వివరించాడు.

కుహ్నెమాన్‌ ఈ సిరీస్‌తోనే టెస్టుల్లోకి అడుగుపెట్టాడు. ఇదివరకు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోయినా అద్భుతంగా రాణించాడు.  లెగ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆసీస్‌ జట్టులో స్థానం దక్కించుకున్న అతడు మూడు టెస్టులు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.  ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 1 మొత్తం 6 వికెట్లు తీసి కంగారుల విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు