Matthew Wade: మాథ్యూవేడ్‌ హెల్మెట్‌ విసిరికొట్టడంతో.. మ్యాచ్‌ రిఫరీ మందలింపు

గుజరాత్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మాథ్యూవేడ్‌ మందలింపునకు గురయ్యాడు. భారత టీ20 లీగ్‌ ‘కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌’ లెవెల్‌ -1 నేరం కింద నిబంధనలను ఉల్లంఘించాడు...

Published : 20 May 2022 12:10 IST

(Photo: Matthew Wade Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మాథ్యూవేడ్‌ మందలింపునకు గురయ్యాడు. భారత టీ20 లీగ్‌ ప్రవర్తనా నియమావళి లెవెల్‌ -1 నేరం కింద నిబంధనలను ఉల్లంఘించాడు. గతరాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వేడ్‌ (16) పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా మాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. అయితే, బ్యాట్‌కు బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌లో తాకిందనే గట్టి నమ్మకంతో అతడు రివ్యూకు వెళ్లాడు. అక్కడ రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకుతున్నట్లు అనిపించినా స్పైక్‌ కనిపించలేదు. దీంతో థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే అంపైర్‌ ఔటివ్వడంతో వేడ్‌ వెనుదిరగక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే అసహనంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కి చేరిన అతడు.. అక్కడ హెల్మెట్‌ను తీసి విసిరిపారేశాడు. అలాగే బ్యాట్‌ను కూడా పలుమార్లు నేలకేసి కొట్టినట్లు ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో మ్యాచ్‌ రిఫరీ అతడిని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని