Team India: వన్డేలకు మయాంక్‌ అగర్వాల్‌ ఎంపిక

మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో సిరీస్ నిర్వహణపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి...

Updated : 03 Feb 2022 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో సిరీస్ నిర్వహణపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి. అయితే, జట్టు యాజమాన్యం తాజాగా మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేయడం గమనార్హం. బుధవారం ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌తో సహా శ్రేయస్‌ అయ్యర్‌, స్టాండ్‌బై బౌలర్‌ నవ్‌దీప్‌ సైని, ఇంకా పలువురు సహాయక సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో వీరందరూ ఇప్పుడు హోటల్‌లోనే తమకు కేటాయించిన గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరిని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వన్డే సిరీస్‌కు ముందు ఇద్దరు ఓపెనర్లు వైరస్‌ బారినపడిన నేపథ్యంలో జట్టు యాజమాన్యం కొత్తగా మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. అలాగే రోహిత్‌ శర్మ ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్‌తో.. మయాంక్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. కాగా, ఈనెల 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా.. 16, 18, 20 తేదీల్లో మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని