టీమ్‌ఇండియా ఐదో వికెట్‌

టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్‌ కోల్పోయింది. భోజన విరామం తర్వాత తొలి ఓవర్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌(38; 75 బంతుల్లో 3x4, 1x6) ఔటయ్యాడు...

Published : 17 Jan 2021 08:22 IST

బ్రిస్బేన్‌: టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్‌ కోల్పోయింది. భోజన విరామం తర్వాత తొలి ఓవర్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌(38; 75 బంతుల్లో 3x4, 1x6) ఔటయ్యాడు. హేజిల్‌వుడ్‌ వేసిన 60.2 ఓవర్‌కు స్లిప్‌లో స్టీవ్‌స్మిత్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 161 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రిషభ్‌పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. 62 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోర్‌ 165/5గా నమోదు కాగా‌ ఇంకా 204 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు 62/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే పుజారా(25) హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కగా, తర్వాత అజింక్య రహానె(37) మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో వేడ్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ భోజన విరామ సమయానికి 161/4 స్కోర్‌ సాధించింది.

ఇవీ చదవండి..
సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
శెభాష్‌ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని