CWG 2022 : చాను మాకు ప్రేరణ

పాకిస్థాన్‌ వెయిట్‌లిఫ్టర్‌ దస్తగిర్‌ బట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన వెంటనే అతణ్ని అభినందించిన వారిలో భారత సూపర్‌స్టార్‌ మీరాబాయి చాను కూడా ఉంది. ‘‘ఆమె నన్ను అభినందించినప్పుడు, నా ప్రదర్శనను మెచ్చుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది’’ అని 109+ విభాగంలో పసిడి

Updated : 05 Aug 2022 07:22 IST

బర్మింగ్‌హామ్‌: పాకిస్థాన్‌ వెయిట్‌లిఫ్టర్‌ దస్తగిర్‌ బట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన వెంటనే అతణ్ని అభినందించిన వారిలో భారత సూపర్‌స్టార్‌ మీరాబాయి చాను కూడా ఉంది. ‘‘ఆమె నన్ను అభినందించినప్పుడు, నా ప్రదర్శనను మెచ్చుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది’’ అని 109+ విభాగంలో పసిడి గెలిచిన అనంతరం బట్‌ వ్యాఖ్యానించాడు. ‘‘మీరాబాయి చాను మాకు ప్రేరణ. దక్షిణాసియా దేశాల వెయిట్‌లిఫ్టర్లు కూడా ఒలింపిక్స్‌లో పతకం గెలవొచ్చని ఆమె నిరూపించింది. ఆమె టోక్యోలో రజతం గెలిచినప్పుడు మేమెంతో గర్వపడ్డాం’’ అని అన్నాడు. 109+ కిలోల కాంస్యం గెలిచిన గుర్‌దీప్‌ సింగ్‌ తన సన్నిహిత మిత్రుల్లో ఒకడని బట్‌ చెప్పాడు. ‘‘గత ఏడెనిమిదేళ్లుగా మేం మంచి స్నేహితులం. విదేశాల్లో కొన్నిసార్లు కలిసి శిక్షణ పొందాం. మేం ఎప్పుడూ మాట్లాడుకుంటుంటాం’’ అని అన్నాడు. 24 ఏళ్ల బట్‌ టోర్నమెంట్లలోఆడేందుకు గతంలో రెండు సార్లు భారత్‌కు వచ్చాడు. ఆ రెండు సార్లు అక్కడి ప్రజలు తననెంతో ఆదరించారని బట్‌ తెలిపాడు. పాక్‌లో కన్నా భారత్‌లోనే తనకు ఎక్కువ అభిమానులు ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని