IPL 2021: ముంబయి ఓటములపై మీమ్స్‌.. ఓ లుక్కేయండి!

బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవడం చూసి.. ఒకప్పటి ముంబయి జట్టేనా అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Published : 28 Sep 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటి వరకూ అత్యధికంగా ఐదుసార్లు కప్పుకొట్టిన ముంబయి ఇండియన్స్‌ ఈ సారి ఎందుకో తడబడుతోంది. ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఈ సీజన్‌ రెండో దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడో స్థానానికి పడిపోయింది. బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవడం చూసి.. ఒకప్పటి ముంబయి జట్టేనా అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నిన్నటి మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి 111 పరుగులకే ఆలౌటయ్యింది. రోహిత్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలయ్యారు. దీంతో ముంబయి ఇండియన్స్‌పై దారుణంగా ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఒకరు జట్టు సభ్యుల సాధించిన స్కోర్లతో ఏకంగా ఫోన్‌ నంబర్‌ రూపొందించి ట్రూ కాలర్‌లో ‘ముంబయి ఇండియన్స్‌ స్కోర్‌’ అని పెట్టేశాడు. ముఖ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, చాహర్‌పై దారుణంగా ట్రోల్స్‌కు దిగారు. ఈ నలుగురూ రాబోయే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌నకు ఆడనున్నారు. దీంతో ఈ మ్యాచ్‌ చూసిన తర్వాత బీసీసీఐ పునరాలోచనలో పడిందని మరికొందరు ఫన్నీగా మీమ్స్‌ చేశారు. ముంబయిని ఓడించినందుకు ఆనందపడాలో, అందులోని ముఖ్యమైన ఆటగాళ్లతో టీ20కి ఎలా వెళ్లాలో తెలీక కోహ్లీ సైతం ఆందోళన పడుతున్నట్లు ఇంకొందరు మీమ్స్‌ రూపొందించారు. ఆ మీమ్స్‌ మీరూ చూసేయండి..










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని