Rishabh pant: ఎన్నడా పంత్‌-యు.. ఇలాగైతే ఎలా? : యువ ఆటగాడిపై క్రిస్‌ శ్రీకాంత్‌ అసంతృప్తి

పంత్‌ మరింత ఒత్తిడికి గురికాకముందే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం ఇవ్వాలని క్రిస్‌ శ్రీకాంత్‌ సూచించాడు. 

Published : 29 Nov 2022 01:39 IST

దిల్లీ: టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడంటూ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు. ఇటీవలి కాలంలో అతడి ప్రదర్శన తననెంతో నిరాశపరుస్తోందని తెలిపాడు. ఈ ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి కొంత విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. 

‘‘పంత్‌కు ఆటనుంచి కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఇది. టీమ్‌మేనేజ్‌మెంట్‌ అతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. అతడికి విరామం ఇచ్చి రెండు మ్యాచ్‌లకు దూరం చేయడమా? లేక రెండు మ్యాచ్‌లు ఆడించి తొలగించడమా? అనేది వారే నిర్ణయించుకోవాలి. ఈ బ్యాటర్‌ సైతం తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు. నేను ఈ విషయంలో చాలా నిరాశతో ఉన్నాను. ‘‘ఎన్నడా పంతు?(తమిళంలో)’’ ఇలాగైతే ఎలా? ప్రపంచకప్‌ సమీపిస్తోన్న వేళ పంత్‌ సరిగా ఆడలేకపోతున్నాడనే విమర్శలు తెచ్చుకోవడం అంత మంచిది కాదు. ఇప్పటికే తన ఆటతీరుపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అతడు ఈ విషయంలో ఒత్తిడికి గురికాకముందే తనను తాను కొత్తగా నిరూపించుకోవాలి’’ అని ఈ మాజీ ఆటగాడు సూచించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు