MIvsCSK:10 ఓవర్లు..30 సిక్సర్లు..30 బౌండరీలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమ మ్యాచులు జరిగాయి. హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి తేలిన ఫలితాలు, సూపర్‌ ఓవర్లో గెలిచిన మ్యాచులను వీక్షించాం. దిల్లీ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌,....

Updated : 02 May 2021 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఎన్నో అత్యుత్తమ మ్యాచులు జరిగాయి. హోరాహోరీగా సాగిన పోరాటాలెన్నో చూశాం. ఆఖరి బంతికి తేలిన ఫలితాలు, సూపర్‌ ఓవర్లో గెలిచిన మ్యాచులను వీక్షించాం. దిల్లీ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచు సైతం ఇదే కోవలోకి వస్తుంది. చరిత్రలో అత్యంత గొప్ప మ్యాచుల్లో ఒకటిగా నిలిచిపోనుంది. బౌండరీలు, సిక్సర్ల వరద పారిన ఈ పోరులో రికార్డులెన్నో బద్దలయ్యాయి.

* మొదట సీఎస్‌కే 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ముంబయిపై చెన్నైకి ఇదే అత్యధిక స్కోరు.

* భారీ లక్ష్యాన్ని ముంబయి ఆఖరి బంతికి ఛేదించింది. 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక విజయవంతమైన ఛేదన. ముంబయి చేసిన అత్యధిక ఛేదనా ఇదే కావడం గమనార్హం.

* అంబటి రాయుడు (72*; 27 బంతుల్లో ) మొదట అజేయంగా నిలిచాడు. అతడు కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. చెన్నై తరఫున ఇది మూడో అత్యధిక వేగవంతమైన అర్ధశతకం. అంతకు ముందు 2014లో పంజాబ్‌పై రైనా 16 బంతుల్లో, 2012లో బెంగళూరుపై ఎంఎస్‌ ధోనీ 20 బంతుల్లో నమోదు చేశారు.

* ఐపీఎల్‌ మ్యాచుల్లో బుమ్రా ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. నాలుగు ఓవర్ల కోటా వేసి 56 పరుగులు ఇచ్చాడు. 2015లో దిల్లీపై 55, అదే ఏడాది బెంగళూరుపై 52, 2017లో గుజరాత్‌పై 45 పరుగులు ఇవ్వడం గమనార్హం.

* విజయవంతమైన ఛేదనల్లో ఆఖరి 10 ఓవర్లలో చేసిన అత్యధిక పరుగులు 138. సీఎస్‌కేపై ముంబయి చేసింది. పొలార్డ్‌ (87*; 34 బంతుల్లో) ఊచకోతే ఇందుకు కారణం. 2019లో పంజాబ్‌పైనా ముంబయి 133 పరుగులు చేసింది. అప్పుడూ పొలార్డే 31 బంతుల్లో 83 బాదేశాడు. 2013లో బెెంగళూరుపై పంజాబ్‌ 126 పరుగులు చేయడం గమనార్హం.

* ఈ మ్యాచులో మొత్తం 30 సిక్సర్లు, 30 బౌండరీలు నమోదయ్యాయి. అంటే మొత్తం 40 ఓవర్లు ఆట సాగితే 10 ఓవర్లు బౌండరీలే బాదడం ప్రత్యేకం.

* చెన్నై 16 సిక్సర్లు, 14 బౌండరీలు బాదగా ముంబయి 14 సిక్సర్లు, 16 బౌండరీలు కొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని