Hardik Pandya: పాండ్యను భవిష్యత్‌ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా చూడొచ్చు

టీమ్‌ఇండియా భవిష్యత్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యను పరిగణలోకి తీసుకోవచ్చని చాలా మంది మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు...

Published : 31 May 2022 09:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా భవిష్యత్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యను పరిగణనలోకి తీసుకోవచ్చని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో గుజరాత్‌ను తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపిన అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటూనే పాండ్య కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. దీంతో పలువురు మాజీలు ఇలా చెప్పుకొచ్చారు.

* కొత్త ఫ్రాంఛైజీకి ఇది అద్భుతమైన విజయం. ఒకవేళ టీమ్‌ఇండియాకు భవిష్యత్‌లో కెప్టెన్‌ అవసరమైతే నేను పాండ్యను కాదని వేరొకరిని చూడలేను.  -మైఖేల్‌ వాన్‌

* గుజరాత్‌ కెప్టెన్‌గా పాండ్య చక్కటి ప్రదర్శన చేసి మనందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇలాంటి మెగా టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించే ఆటగాడు టీమ్‌ఇండియాకు కూడా కెప్టెన్‌గా పనిచేయగలడు.  -సంజయ్‌ మంజ్రేకర్‌

* హార్దిక్‌ కచ్చితంగా టీమ్‌ఇండియా కెప్టెన్సీకి పోటీదారు అయ్యాడు. ఇది నా అంచనా కాదు, అందరిదీ. ఆటలో నాయకత్వ్వ లక్షణాల గురించి ఎక్కువ సమాచారం మనకి అందుబాటులో ఉండదు. కానీ ఎవరిలో అయినా ఆ లక్షణాలు కనిపిస్తే.. జాతీయ స్థాయిలో జట్టును నడిపించే అవకాశం త్వరగానే వచ్చేస్తుంది. హార్దిక్‌తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు పోటీలో ఉన్నారు. అతనే తర్వాతి కెప్టెన్‌ అని చెప్పలేను. కానీ.. సెలక్షన్‌ కమిటీకి అతడి రూపంలో చక్కటి ప్రత్యామ్నాయం కనిపిస్తోంది.  -సునీల్‌ గావస్కర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని