Vaughan: టెస్టుల్లో నా తొలి వికెట్‌‌.. ఇప్పుడు బ్యాటింగ్‌ కోచ్‌: మైకెల్ వాన్‌

భారత టీ20 లీగ్‌లోని పంజాబ్‌ ఫ్రాంచైజీకి వసీం జాఫర్ బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. దీంతో మైకెల్‌ వాన్‌ ట్విటర్ వేదికగా సరదా ట్వీట్‌ చేశాడు. వీరిద్దరి మధ్య ట్విటర్‌లో వార్‌ జరిగే విషయం తెలిసిందే.

Updated : 17 Nov 2022 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్‌లోని పంజాబ్‌ ఫ్రాంచైజీకి వసీం జాఫర్ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. దీంతో తన ట్విటర్ స్నేహితుడు, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ స్పందించాడు. వీరిద్దరి మధ్య జరిగే ట్విటర్‌ వార్‌ను మనం ఎన్నోసార్లు వీక్షించాం కదా.. తాజాగా మరోసారి మైకెల్‌ వాన్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. పంజాబ్‌కు జాఫర్ బ్యాటింగ్‌ కోచ్‌గా అవకాశం రావడం. ‘‘ఎవరినైతే నేను ఔట్‌ చేశానో.. వారు ఇప్పుడు బ్యాటింగ్‌ కోచ్‌’’ అంటూ మైకెల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు. 

మైకెల్‌ వాన్‌ బ్యాటర్‌ కదా.. అని మీకు డౌట్ రావొచ్చు.. అయితే, మైకెల్‌ వాన్‌ అప్పుడప్పుడూ బౌలింగ్‌ వేసేవాడు. అలా తొలిసారి టెస్టుల్లో జాఫర్ వికెట్‌ను వాన్‌ తీశాడు. ఇప్పుడు దానిని గుర్తు చేస్తూ సరదాగా ట్వీట్‌ చేయడం గమనార్హం. 2002 లార్డ్స్‌ వేదికగా జరిగిన భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జాఫర్ (53) అర్ధశతకం సాధించి మంచి ఊపు మీదున్నాడు. అదే సమయంలో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌గా ఆఫ్ బ్రేక్‌ బౌలింగ్‌తో జాఫర్‌ను బుట్టలోపడేసిన మైకెల్ వాన్‌ వికెట్‌ తీశాడు. 82 టెస్టులు ఆడిన మైకెల్‌ వాన్ కేవలం ఆరు వికెట్లను మాత్రమే పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని