
Virat Kohli : విరాట్‌ను డుప్లెసిస్ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లగలగాలి : మైకెల్ వాన్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు బెంగళూరు తరఫున 12 మ్యాచుల్లో 19.64 సగటుతో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇవాళ పంజాబ్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే బెంగళూరుకు ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖరారైనట్లే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ స్పందించాడు. పదేళ్ల కిందట విరాట్ ఎంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడో.. ఇప్పుడు కూడా అలానే ఆడాలని సూచించాడు. తొలి ఓవర్లలో కాస్త కుదురుకోగలిగితే కోహ్లీ భారీ స్కోర్లను చేయగలడని అభిప్రాయపడ్డాడు.
‘‘విరాట్ కోహ్లీని బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ పదేళ్ల వెనక్కి తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నా. ఇప్పుడున్న ప్రొఫైల్ లేని రోజులు అవి. బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టించిన సమయమది. మంచి ఫామ్‌లో ఉండి టాప్ బ్యాటర్‌గా ఎదుగుతున్న కోహ్లీని మళ్లీ చూడాలని ఉంది. ఇప్పటి వరకు ఏం చేశామనేది మరిచిపోవాలి. నీ వయసు గురించి ఆలోచించకూడదు. మంచి ఆరంభం లభిస్తే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు. ఒకవేళ కోహ్లీ 35 పరుగులు వరకు చేస్తే భారీ స్కోర్లుగా మలుస్తాడు. తొలి పది ఓవర్లలో కుదురుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. దానిని అధిగమించి గతంలో మాదిరిగా ఆడితే డేంజరస్ బ్యాటర్ అవుతాడు’’ అని వాన్ వివరించాడు. ప్రస్తుత సీజన్‌లో విరాట్ కోహ్లీ ఒకే ఒక అర్ధ శతకం (53 బంతుల్లో 58 పరుగులు) సాధించాడు. టీ20 చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (973) చేసిన ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే