PCB: మికీ ఆర్థర్‌ పాక్‌ ‘ఆన్‌లైన్ కోచ్‌’.. సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువ

‘ఆన్‌లైన్‌ కోచ్‌’ ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో హల్‌చల్‌ చేస్తున్నపదం. సోషల్‌ మీడియాను మీమ్స్‌తో వెల్లువెత్తేలా చేస్తోంది. మికీ ఆర్థర్‌ సేవలను ‘ఆన్‌లైన్‌’ వినియోగించుకొనేందుకు పీసీబీ ఎదురు చూస్తోంది.

Published : 01 Feb 2023 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్ జట్టును అద్భుతంగా నడిపించిన కోచ్‌ల్లో మికీ ఆర్థర్‌ ప్రథముడు. అయితే గత కొద్ది రోజులుగా పాకిస్థాన్‌ వరుస ఓటములను చవిచూసింది. సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లను సైతం కోల్పోయింది. దీంతో బాబర్‌ అజామ్‌ నాయకత్వంలో టీమ్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదిని నియమించింది. అలాగే గతంలో కోచ్‌గా పని చేసిన మికీ ఆర్థర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. కానీ, కౌంటీ సీజన్‌లోని డర్బీషైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌కు కోచ్‌గా బాధ్యతల నిర్వర్తిస్తున్న ఆర్థర్‌.. ఆసియా కప్‌ వరకు పాక్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోరు. అయితే అప్పటి వరకు పాక్‌ క్రికెట్‌ జట్టుకు ‘ఆన్‌లైన్’ వేదికగా మాత్రం సూచనలు ఇస్తాడని పీసీబీ పేర్కింది. దీంతో సోషల్‌ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేశాయి. 

పీసీబీ ‘ఆన్‌లైన్‌ కోచ్’ నియామకంపై పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది స్పందించాడు. ‘‘జాతీయ జట్టుకు విదేశీ కోచ్‌ను కేవలం ఆన్‌లైన్‌ కోచింగ్ కోసం నియమించడం అనేది అర్థం చేసుకోలేనిది.  అయితే ఇదంతా క్షేత్రస్థాయి నుంచి ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందనేది నా భావన’’ అని వ్యాఖ్యానించాడు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని