Milkha singh: సికింద్రాబాద్‌ని మర్చిపోలేను
1952-53లో నేను ఈఎంఈ సెంటర్‌లోని ఓ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకున్నాను
బొల్లారంలో షాపింగ్ చేసేవాడిని
గతేడాది హైదరాబాద్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మిల్కాసింగ్
హైదరాబాద్: భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ (91) కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 1932 నవంబర్ 20న పంజాబ్ (పాకిస్థాన్) గోవింద్‌పురలో జన్మించిన మిల్కా సింగ్‌కు హైదరాబాద్‌తోనూ అనుబంధం ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉండే ఈఎంఈ సెంటర్‌లో 1952లో ఆయన తొలిసారి అథ్లెటిక్స్‌లో పాల్గొన్నారు.
బొల్లారం నుంచి అమ్ముగూడ వరకూ..
గతేడాది జులైలో జరిగిన ఓ ఇంటర్య్వూలో హైదరాబాద్ నగరంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మిల్కా. బొల్లారం నుంచి అమ్ముగూడా మీదుగా వచ్చే రైలు మార్గంలోనే పరుగెత్తేవాడిని. ఆ రైలులో ఉండే ఓ లోకోపైలట్ ‘‘కమాన్ సింగ్... కమాన్ సింగ్’’ అని ప్రోత్సహించేవాడు. ఆయన మాటలు నాకు ఉత్సాహాన్ని ఇచ్చేవి. దీంతో ఎక్కువ దూరం పరుగెత్తేవాడిని. ఇవే నాలో వేగం, ఓర్పునీ పెంచేలా చేశాయి. అంతేకాదు.. దేశవ్యాప్తంగా ఎన్నో అడవుల్లో పరుగెత్తేటప్పుడు.. ఈఎంఈ సెంటర్‌ని గుర్తుచేసుకునేవాడిని.. ఆ క్రెడిట్ అంతా ఆర్మీ, ఈఎంఈ, సికింద్రాబాద్ కే దక్కుతుందని చెప్పేందుకు గర్వంగా ఫీల్ అవుతా. ఈ రోజు నాకు మిల్కా సింగ్ అనే గుర్తింపుతో పాటు దేశానికి ఇంత మంచి పేరు తెచ్చానంటే.. అది అంతా ఆర్మీ, ఈఏంఈ సెంటర్ కే దక్కుతుంది. ఇక షాపింగ్ విషయానికొస్తే.. బట్టలు, ఇంటి సామగ్రి కావాలంటే మాత్రం బొల్లారంకి వెళ్లేవాడిని అని నగరంతో అనుబంధాన్ని నెమరువేసుకునేవారు.
ఆ స్టేడియంకి మిల్కా పేరు..
సికింద్రాబాద్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. 1952-53లో నేను ఈఎంఈ సెంటర్‌లోని ఓ స్టేడియంలో ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్టేడియంకి నాపేరు పెట్టడం, దాన్ని నా చేతుల మీదగా ప్రారంభించడం ఎప్పటికీ మర్చిపోలేను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి