Covid 19: మిల్కా సింగ్‌కు కరోనా పాజిటివ్‌

భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం, పరుగుల వీరుడు మిల్కా సింగ్‌(91) కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. ఛండీగడ్‌లోని

Published : 20 May 2021 19:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం, పరుగుల వీరుడు మిల్కా సింగ్‌(91) కరోనా బారినపడ్డారు. అయితే ఆయనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. చండీగఢ్‌లోని నివాసంలో ఐసోలేషన్‌కి వెళ్లారు.  మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని భార్య నిర్మల్‌  కౌర్‌ పేర్కొన్నారు.

‘మా నివాసంలో సహాయకులుగా ఉండే వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కుటుంబసభ్యులందరం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాం. నా ఒక్కడికే పాజిటివ్‌గా తేలింది.  నాకు కరోనా రావడం పట్ల ఆశ్చర్యపోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దగ్గు, జ్వరం లేవు. మూడు, నాలుగు రోజుల్లో ఎప్పటిలాగా సాధారణ స్థితికి చేరుకుంటానని నా వ్యక్తిగత వైద్యుడు చెప్పారు. నిన్న కూడా జాగింగ్ చేశా. ఉత్సాహంగా ఉన్నా’ అని మిల్కా సింగ్ అన్నారు.

మిల్కా సింగ్‌ని  ‘ప్లయింగ్ సిక్‌’ అని కూడా పిలుస్తారు. ఈ దిగ్గజ అథ్లెట్‌ ఆసియా గేమ్స్‌లో ఐదుసార్లు బంగారు పతకాలను సాధించాడు. కానీ, 1960 రోమ్‌  ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో అద్భుత ప్రదర్శన కనబరిచి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్నాడు.

మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో భాగ్ మిల్కా భాగ్‌’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2013లో విడుదలైంది. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌..మిల్కా పాత్ర పోషించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని