హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ కొత్త జెర్సీని విడుదల చేసిన కేటీఆర్‌

హైదరాబాద్‌ బ్లాక్‌  హాక్స్‌ జట్టు రూపే వాలీబాల్‌ లీగ్‌ కొత్త జెర్సీని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు.

Published : 07 Feb 2023 20:57 IST

హైదరాబాద్‌: ఇటీవల అహ్మదాబాద్‌తో హోరాహోరీగా జరిగిన వాలీబాల్‌ మ్యాచ్‌లో ఐదు సెట్ల విజయం తర్వాత ఉత్సాహంతో ఉన్న హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు మరో సీజన్‌కు సన్నద్ధమైంది.  దేశీయ ప్రీమియర్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ రెండో ఎడిషన్‌ను అత్యంత ప్రోత్సాహకర సీజన్‌గా నిలిపేందుకు టీమ్‌ రూపే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ కోసం కొత్త జెర్సీని విడుదల చేసింది. బ్లాక్‌, ఆరెంజ్‌ డిజైన్‌తో చూడగానే ఎంతో ఆకట్టుకొనే రీతిలో ఉన్న ఈ కొత్త జెర్సీని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌; ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజధాని నగరం హైదరాబాద్‌లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. నగరంలో క్రీడాభివృద్ధికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్‌ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్‌ ఓనర్‌), శ్యామ్‌‌ గోపు (సహ యజమాని) తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని