Mirabai Chanu: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌ షిప్‌లో మీరాబాయికి రజతం

ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో గాయంతోనే పాల్గొన్న మీరాబాయి(Mirabai chanu) చాను రజతం గెలిచింది. 

Updated : 07 Dec 2022 14:03 IST

బొగొటా: ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌(Weightlifting) ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్‌ విజేత మిరాబాయి చాను(Mirabai chanu) భారత్‌కు రజత పతకాన్ని(Silver medal) అందించింది. కొలంబియాలోని బొగొటా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 49 కేజీల విభాగంలో మీరాబాయి తలపడింది. మొత్తం 200 కేజీల(87 కిలోల స్నాచ్‌, 113కిలోల క్లీన్‌ అండ్‌ జర్క్‌) బరువును ఎత్తి పతకం సాధించింది. 206(93+113) కిలోలు ఎత్తిన చైనా క్రీడాకారిణి జియాంగ్‌ జిహువా స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. 198 కేజీలు(89+109)ఎత్తి టోక్యో క్రీడాకారిణి హూ జిహువా కాంస్యం సాధించింది. 

సెప్టెంబర్‌ నుంచి మణికట్టు గాయంతో బాధపడుతున్న చాను గాయంతోనే ఈ పోటీల్లో పాల్గొంది. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవాలని మేం అనుకోలేదు. ఈ గేమ్‌ తర్వాత మాకు వచ్చే ఈవెంట్‌కు కావలసినంత సమయం ఉంది. ఇప్పుడు తన గాయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక గేమ్‌ విషయంలో మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే, చాను సాధారణంగా ఎత్తే బరువే ఇది. భవిష్యత్తులో మరింత మెరుగవుతాం’’అంటూ హెడ్‌ కోచ్‌ విజయ్‌ శర్మ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని