Mirabai Chanu: చాను మనసు దోచిన చిన్నది..!

పిల్లలకు ఎవరైనా నచ్చాలేగానీ.. వారిని అనుకరించకుండా ఉండలేరు.. అలానే ఓ చిన్నదానికి వెయిట్‌ లిఫ్టర్‌ చాను నచ్చేసింది.. వెంటనే తన చిట్టి చేతులపై పౌడర్‌ పోసుకోని రుద్దుకొంది..

Updated : 27 Jul 2021 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పిల్లలకు ఎవరైనా నచ్చాలే గానీ.. వారిని అనుకరించకుండా ఉండలేరు. అలానే ఓ చిన్నారికి వెయిట్‌ లిఫ్టర్‌ చాను నచ్చేసింది. వెంటనే తన చిట్టి చేతులపై పౌడర్‌ పోసుకోని రుద్దుకొంది. అక్కడే ఉన్న వెయిట్‌ లిఫ్టింగ్‌ రాడ్‌ వద్దకు వెళ్లి దండం పెట్టుకొంది. ఎందుకో అనుమానం వచ్చి.. వెనుకాలే ఉన్న టీవీలో చాను ఏం చేస్తోందో చూసింది..! ఆ చిన్నారి వెనకాలే ఉన్న టీవీలో మీరాబాయి చాను టోక్యోలో వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న వీడియో ప్రసారం అవుతోంది..! వెంటనే ఆ చిన్నారి కూడా రాడ్‌ గ్రిప్‌ను సరిచూసుకొని.. స్నాచ్‌.. క్లీన్‌ అండ్‌ జర్క్‌ మొత్తాన్ని కలిపికొట్టేసింది.. ఆ తర్వాత చానును అనుకరిస్తూ ఓ వెండి పతకాన్ని మెడలో వేసుకొని అభివాదాలు.. సంబరాలు మొదలుపెట్టింది. ఈ చిట్టితల్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ పాప భారత వెయిట్‌ లిఫ్టర్‌ సతీష్‌ శివలింగమ్‌ కుమార్తె..!

ఈ వీడియోను కామన్వెల్త్‌ స్వర్ణపతకాల విజేత అయిన సతీష్‌శివలింగమ్‌ మీరాబాయి చానుకు ట్యాగ్‌ చేశారు. ‘జూనియర్‌ మీరాబాయి చాను.. ప్రేరణ అంటే ఇదే’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌ చూసి మురిసిపోయిన చాను రీట్వీట్‌ చేసింది.  ‘చాలా ముద్దుగా ఉంది. జస్ట్‌ లవ్‌ దిస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. దేశాన్ని, రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గౌరవం కల్పించింది. మణిపూర్‌ ప్రభుత్వం పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగిగా నియమించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని