Mirabai Chanu: 201 కేజీలు ఎత్తడం అంత సులభమేమీ కాదు.. కానీ.. : మీరాబాయి చాను

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది మీరాబాయి చాను. మహిళల

Updated : 31 Jul 2022 13:26 IST

(ఫొటోలు : మీరాబాయి చాను ట్విటర్‌)

బర్మింగ్‌హామ్‌ : 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో(Commonwealth Games 2022) భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది మీరాబాయి చాను(Mirabai Chanu). మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 201 కేజీల బరువెత్తి ఈ భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ కొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని సాధించిన చాను.. తన విజయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తనపై నమ్మకాన్ని ఉంచిన దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘201 కేజీల బరువు ఎత్తడం అంత తేలికగా అనిపించలేదు. కానీ.. కోట్లాది మంది ప్రజలు చూపించిన ప్రేమ, అభినందనలకు నా ధన్యవాదాలు. ప్రతి సవాలు ఒక ప్రయత్నమే’ అంటూ ఆమె ట్విటర్‌లో రాసుకొచ్చారు.

‘ఇక్కడ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. రికార్డుతో బంగారు పతకం గెలవడం ఎప్పుడూ మంచిదే. నేను స్వర్ణ పతకం గెలుస్తానని అనుకున్నాను. దాన్ని సాధించాను. టోక్యో ఒలింపిక్స్‌ క్రడీల అనంతరం  స్నాచ్‌లో నా ప్రదర్శన మెరుగుపరుచుకునేందుకు కృషి చేశాను. ఇక్కడ రాణించినందుకు సంతోషంగా ఉంది. ఇంకా బాగా రాణించేందుకు మరికొన్ని నెలలు కష్టపడతాను. డిసెంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే నా లక్ష్యం’ అని పతకాల ప్రదానోత్సవం అనంతరం ఆమె మాట్లాడుతూ అన్నారు.

ఈ సారి ఫేవరేట్‌గా బరిలో దిగిన చాను 201 కేజీల (88+113) ప్రదర్శనతో కామన్వెల్త్‌ క్రీడల రికార్డు నెలకొల్పి పసిడి పట్టేసింది. ప్రత్యర్థులెవరూ ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు ఆమె ప్రదర్శనకు మధ్య 29 కేజీల అంతరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని