Mitchell Starc: యాషెస్‌ టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. అరుదైన ఘనత సాధించిన స్టార్క్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. యాషెస్‌ టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసి చరిత్రకెక్కాడు. ఇతని కంటే..

Updated : 08 Dec 2021 14:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతోన్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో మిచెల్ స్టార్క్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. యాషెస్‌ సిరీస్‌ టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసి చరిత్రకెక్కాడు. ఇతని కంటే ముందు 1936లో ఎర్నీ మెక్‌ కార్మిక్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఈ రెండు రికార్డులు బ్రిస్బేన్‌ మైదానంలోనే నమోదు కావడం గమనార్హం. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ జట్టుకు ఆరంభంలోనే మిచెల్ స్టార్క్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టెస్టుల్లో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మరో వైపు, టెస్టుల్లో తొలి ఓవర్లోనే వికెట్ తీయడం స్టార్క్‌కిది 13వ సారి కావడం విశేషం. ఆసీస్ బౌలర్ల ధాటికి తొలి టెస్టు మొదటి సెషన్‌ ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 59/4 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రోరీ బర్న్స్, కెప్టెన్‌ జో రూట్‌ డకౌట్‌గా వెనుదిరుగగా.. డేవిడ్‌ మలన్ (6), బెన్ స్టోక్స్ (5) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్ వుడ్ రెండు, మిచెల్ స్టార్క్‌, ప్యాట్‌ కమ్మిన్స్ తలో వికెట్ తీశారు.

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని