
Mithali Raj: మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బయోపిక్.. విడుదల ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌పై బయోపిక్ రూపొందించారు. మిథాలీ పాత్రలో తాప్సి బ్యాటర్‌గా మెరవనుంది. ఈ చిత్రానికి ‘శభాష్ మిథూ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. మిథాలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘శభాష్ మిథూ’ విడుదల తేదీని తన పుట్టిన రోజు సందర్భంగా (డిసెంబరు 3) మిథాలీ రాజ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 2022 ఫిబ్రవరి 4న చిత్రం థియేటర్లలోకి వస్తుందని ఆమె ప్రకటించారు. సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మిథాలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 270 వన్డేలు ఆడి 51.3 సగటుతో 7391 పరుగులు సాధించింది. ఇందులో 7 సెంచరీలు, 59 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 125 నాటౌట్. టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు.
► Read latest Sports News and Telugu News