Sir Mo Farah: ఓ వ్యథ.. ఓ మోసం.. ఓ ఛాంపియన్.. నాలుగు ఒలింపిక్ పతకాలు..!
విజయం.. మోడువారిన చెట్టు బెరడు నుంచి చీల్చుకొచ్చే చిగురు వంటింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పుట్టుకతోటే ఛాంపియన్లైనవారు భయపడరు. దీనికి 5,000 మీటర్లు,
మోఫరా విజయ గాథ ఇది..
ఇంటర్నెట్‌డెస్క్: విజయం.. మోడువారిన చెట్టు బెరడు నుంచి చీల్చుకొచ్చే చిగురు వంటింది. ఎన్ని కష్టాలు ఎదురైనా విజయం సాధించడానికి పుట్టిన వారు భయపడరు. దీనికి 5,000 మీటర్లు, 10,000 మీటర్ల పరుగులో నాలుగు ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఓ ఛాంపియన్ జీవితమే ఉదాహరణ.
సోమాలియా అంతర్యుద్ధంలో తండ్రిని కోల్పోయి బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని యూకేలోని చుట్టాలింటికి చేరుస్తానని ఆశచూపిందో మహిళ. ఆ చిన్నారి గంపెడు ఆశతో యూకేలోని బంధువుల చిరునామా తీసుకొని ఆ మహిళ వెంట జబూటీ చేరుకొన్నాడు. అక్కడి నుంచి అక్రమంగా యూకేకు తీసుకొచ్చారు. కానీ, చుట్టాలింటికి చేర్చలేదు. బలవంతంగా వెట్టిచాకిరీ చేయించారు. కానీ, కాలక్రమంలో ఆ చిన్నారే కష్టాలను జయించి యూకే ఛాంపియన్‌గా నిలిచాడు. రెండు ఒలింపిక్స్‌ల్లో యూకేకు ఏకంగా నాలుగు బంగారు పతకాలు తీసుకొచ్చాడు. బ్రిటన్‌లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘సర్’ బిరుదును అందుకొన్నాడు. అతడే ‘సర్ మోఫరా’..! తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికతో తన జీవితంలోని చీకటి రోజులను పంచుకొన్నాడు.
సోమాలియాలో అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో ఫరా తండ్రి అబ్దిని అక్కడ దుండగులు కాల్చి చంపారు. అప్పుడు ఫరా వయస్సు నాలుగేళ్లు. వారి కుటుంబం సోమాలియా నుంచి విడిపోయిన సోమాలిల్యాండ్‌లో జీవిస్తోంది. ఆ దేశం 1991లో స్వాతంత్ర్యం ప్రకటించుకొన్నా.. ప్రపంచం గుర్తించలేదు. ఫరాకు తొమ్మిదేళ్ల వయస్సులో ఓ కుటుంబం సోమాఐల్యాండ్ నుంచి అతన్ని సమీపంలోని జబూటీకి
తీసుకెళ్లింది. అక్కడ ఓ గుర్తుతెలియని మహిళ యూకేలోని బంధువుల వద్దకు తీసుకెళతానని ఆశచూపింది. జీవితంలో అనుకోని అదృష్టం వచ్చినందుకు ఫరా సంతోషించాడు. ట్రావెల్ పత్రాల్లో అతని పేరు ముందు మహమ్మద్ అని చేర్చారు. దీంతో అతని పేరు మహమ్మద్ ఫరా అయింది. ఆ తర్వాత అతడి పేరు మోఫరాగా మారింది.
మోఫరా ఆ మహిళతో కలిసి యూకే చేరుకొన్నాక.. పశ్చిమ లండన్ హాన్స్‌లోని ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఫరా వద్ద ఉన్న బంధువుల చిరునామా తీసుకొని చించేసింది. ఈ ఘటనతో తాను మోసపోయానని గ్రహించిన ఫరాకు ఏడుపొచ్చింది. అనంతరం అతని చేత ఇంటిపని, తన పిల్లలకు సంబంధించిన పనులను ఆ మహిళ చేయించడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని చూడాలనుకుంటే మారు మాట్లాడవద్దని హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేక ఫరా ఆ పనులను చేసేవాడు. తరచూ బాధను తట్టుకోలేక బాత్రూమ్‌లో కి వెళ్లి గంటల కొద్దీ వెక్కివెక్కి ఏడ్చేవాడు.
అతడికి క్రీడా భాషే అర్థమైంది..!
ఫరాకు 12ఏళ్లు వచ్చే వరకు స్కూల్లో చేర్చలేదు. ఆ తర్వాత ఫెల్థామ్ కమ్యూనిటీ కాలేజీలో ‘ఇయార్-7’లో చేర్చారు. అక్కడి సిబ్బందికి సోమాలియా శరణార్థిగా పరిచయం చేశారు. ఫరా ఆ విద్యాలయానికి మాసిన దుస్తులతో వచ్చేవాడు. అతడికి చాలా తక్కువ ఇంగ్లిష్ మాత్రమే వచ్చు. మిగిలిన విద్యార్థులకు దూరంగా ఉండేవాడు. అతడి తరపున ఎవరూ పేరెంట్స్ ఈవినింగ్స్‌కు హాజరయ్యేవారు కాదు. కానీ, ఫరాలో ప్రతిభను అక్కడి వ్యాయామ ఉపాధ్యాయుడు అలన్ వాట్‌కన్సన్ గుర్తించాడు. అతడికి ఇంగ్లిష్ రాకపోయినా కేవలం క్రీడా భాషను మాత్రమే అర్థం చేసుకొంటాడని గ్రహించాడు. ఫరా కూడా ప్రస్తతం దయనీయ జీవితం నుంచి బయటపడటానికి క్రీడలు ఒక్కటే మార్గమని భావించాడు. దీంతో తన జీవితంలోని వెట్టిచాకిరీ, మోసం వంటి చేదు గతాన్ని అలన్‌కు తెలియజేశాడు. వెంటనే అలన్ ఓ సామాజిక సంస్థతో మాట్లాడి ఫరాను వేరే సోమాలియా కుటుంబంతో ఉంచేందుకు ఏర్పాట్లు చేశాడు.
పౌరసత్వం కూడా అక్రమమే..
నాటి నుంచి మోఫరా జీవితం మారిపోయింది. క్రీడలపై దృష్టిపెట్టాడు. 14 ఏళ్ల వయస్సులో లాత్వియాలో ఇంగ్లిష్ స్కూల్స్ రేసులో పాల్గొనడానికి పిలుపు వచ్చింది. కానీ, ప్రయాణ పత్రాలు లేవు. దీంతో అలన్ మరోసారి సాయం చేశాడు. మహమ్మద్ ఫరా పేరుతో బ్రిటన్ పౌరసత్వానికి దరఖాస్తు చేశాడు. జులై 2000లో అది జారీ అయింది. వాస్తవానికి మోఫరా పౌరసత్వం కూడా అక్రమంగా లభించిందే అని అక్కడి న్యాయనిపుణులు చెబుతారు. చట్టపరంగా అతడి బ్రిటన్ జాతీయతను ఎప్పుడైనా తొలగించవచ్చు. కానీ, మోఫరాను చిన్నతనంలోనే మోసపూరితంగా అక్కడి చేర్చి.. వెట్టిచాకిరీకి వాడుకోవడంతో అతడికి అటువంటి రిస్కు చాలా తక్కువ. ఆ తర్వాత ఫరా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో నాలుగు బంగారు పతకాలు సాధించిన తొలి బ్రిటన్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. అతడి అంతర్జాతీయ క్రీడా చరిత్రలో మొత్తం 19 బంగారు, 9 రజత, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్‌తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!