Dhoni-Moeen Ali: ధోనీకి.. ఇతర కెప్టెన్లకు మధ్య వ్యత్యాసమదే: మొయిన్ అలీ

చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వం గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తారు. కెప్టెన్‌ కూల్‌ అంటూ ఆకాశానికెత్తాస్తారు. చెన్నై ఆటగాడు మొయిన్‌ అలీ కూడా తన కెప్టెన్‌ గరించి గొప్పగా చెప్పాడు.

Published : 23 May 2023 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో (GT vs CSK) తొలి క్వాలిఫయర్‌లో తలపడనుంది. ఈ క్రమంలో చెన్నై ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తమ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ.. ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారి నుంచి ఫలితం రాబట్టడంలో ధోనీ నేర్పరి. ఈ సీజన్‌లోనూ యువ బౌలర్లతోనే అద్భుతాలు సృష్టిస్తూ ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. 

‘‘ప్రతి జట్టుకు సారథి చాలా కీలకం. అతడు తీసుకునే నిర్ణయాలపైనే జట్టు ఫలితం ఆధారపడి ఉంటుంది. యువ క్రికెటర్ల నుంచి మంచి ఫలితాలను రాబట్టగలిగితే.. అంతకుమించిన గొప్ప కెప్టెన్సీ మరొకటి ఉండదు. అత్యుత్తమ జట్టులో ఎప్పుడూ  స్థానం కోసం తీవ్ర పోటీ ఉండటం సహజం. అవకాశం వచ్చినప్పుడు తమను నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇలాంటి అవకాశాలు తరచూ రావు. వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు. ప్రతి ఆటగాడిలోనూ ఇదే ఆలోచన వస్తుంది. ఇలా రావడానికి ప్రధాన కారణం కెప్టెన్‌. 

ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతూ అవసరమైన చర్యలను జట్టు సారథి తీసుకుంటాడు. ఇదే ఇతర కెప్టెన్లకు ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రధాన వ్యత్యాసం. ఆరంభంలో ఓ రెండు మ్యాచుల్లో సరిగా ఆడకపోతే ఆటగాళ్లను పక్కన పెట్టేయకుండా అవకాశాలూ ఇస్తూ ఉంటాడు. ప్లేయర్‌లోని సత్తాను మాత్రమే ధోనీ, ఇతర సహాయక సిబ్బంది చూస్తారు. అప్పుడే వారికి ఛాన్స్‌లు ఇస్తారు. ఇతర జట్లు అలా ఉండలేవు’’ అని మొయిన్‌ అలీ తెలిపాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు