Najam Sethi: మహమ్మద్‌ అమిర్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చు: నజామ్‌ సేథీ

పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ అమిర్‌ తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటే తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడొచ్చని పీసీబీ ఛైర్మన్‌ నజామ్‌ సేథీ తెలిపాడు.

Published : 24 Jan 2023 16:50 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ అమిర్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడొచ్చని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ నజామ్‌ సేథీ ప్రకటించాడు. 2010లో ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన సిరీస్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అమిర్‌పై  ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తర్వాత అతడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 2020లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. అమిర్‌ నిషేధ కాలం పూర్తైనందున తన రిటైర్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటే తిరిగి జాతీయ జట్టులో స్థానం పొందవచ్చని సేథీ సూచించాడు.

‘‘మహమ్మద్‌ అమిర్‌ తన రిటైర్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటే తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడొచ్చు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పట్ల నేనేప్పుడూ కఠినంగానే వ్యవహరిస్తాను. దోషిగా తేలిన ఏ ఆటగాడు తప్పించుకోకూడదు. కానీ ఒక ఆటగాడు తన నిషేధ కాలం పూర్తి చేసుకున్నాక తిరిగి తన అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించొచ్చు’’ అని సేథీ వెల్లడించాడు. అమిర్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ లీగ్‌(BPL)లో సిల్హెట్‌ స్ట్రెకర్స్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని