Shreyas Iyer: ఆ విషయంలో శ్రేయస్‌ అయ్యర్‌ని ధోనీతో పోల్చిన కైఫ్‌

టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై భారత మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్‌ టెక్నిక్‌ల విషయంలో అతడిన ధోనీతో పోల్చాడు. 

Published : 19 Dec 2022 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తున్నాడు. నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టులో కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ (86; 192 బంతుల్లో 10 ఫోర్లు) శతకానికి చేరువై ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్‌ టెక్నిక్‌ల విషయంలో అతడిని ధోనీతో పోల్చాడు. శ్రేయస్‌ కొన్నిసార్లు షార్ట్ బాల్స్‌ని ఎదుర్కొవడంలో విఫలమైనప్పటికీ నిలకడగా మంచి స్కోరు చేస్తున్నాడని పేర్కొన్నాడు.    

‘ధోని ఫామ్‌లో లేడని మనం ఎప్పుడూ మాట్లాడుతుండే వాళ్లం.  కానీ, అతడు బాగా ఆడి విజయాలు అందించేవాడు. శ్రేయస్ అయ్యర్‌కు కూడా అదే వర్గానికి చెందినవాడు. అతడికి పరుగులు చేయడం తెలుసు. కానీ, అయ్యర్‌కి ఒక బలహీనత ఉంది. పుల్ షాట్ ఆడే క్రమంలో ఔటవుతున్నాడు.  అయినప్పటికీ 2022లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు’ అని కైఫ్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు