Published : 25 May 2022 17:41 IST

Eliminator : ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూకే కాస్త ఎడ్జ్‌ ఉందనిపిస్తోంది: కైఫ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో ఫైనల్‌కు చేరే జట్లలో ఒకటి నిన్న (తొలి క్వాలిఫయిర్‌) తేలిపోయింది. రాజస్థాన్‌పై విజయం సాధించి గుజరాత్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక తేలాల్సింది రెండో టీమ్‌ ఎవరా.. అని? అయితే ముందు ఎలిమినేటర్‌ విజేత జట్టు రెండో క్వాలిఫయిర్‌లో రాజస్థాన్‌తో తలపడి అక్కడి నుంచి ఫైనల్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ లఖ్‌నవూ-బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే తమ అభిమాన జట్టే గెలుస్తుందని నెట్టింట్లో ఫ్యాన్స్‌ నానా హంగామా చేసేశారు. బెంగళూరుతో కాస్త జాగ్రత్తగా ఉండాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ చెబుతున్నాడు. అయితే ఎలిమినేటర్‌ పోరులో బెంగళూరు కంటే లఖ్‌నవూకే కొంచెం అడ్వాంటేజ్ ఉందని మరొక మాజీ ప్లేయర్‌ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. 

లఖ్‌నవూ- బెంగళూరు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలపై కైఫ్ తనదైన విశ్లేషణ చేశాడు. ‘‘బెంగళూరు బౌలింగ్‌ కంటే లఖ్‌నవూ బౌలింగ్‌ దాడి కాస్త బెటర్‌గా ఉంది. గత మ్యాచ్‌లో బెంగళూరు సిరాజ్‌ను పక్కన పెట్టి సిద్ధార్థ్‌ కౌల్‌ను తీసుకుంది. అయితే కౌల్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. బెంగళూరు తరఫున హేజిల్‌వుడ్‌ ఉన్నప్పటికీ ఈడెన్‌ మైదానంలో లఖ్‌నవూ పేస్‌ గట్టిగా ఉంది. అందుకే బెంగళూరు బ్యాటర్లు భారీ షాట్లు ఆడాలి. మ్యాచ్‌ను గెలవాలంటే తప్పనిసరిగా సిక్సర్లతో మోత మోగించాలి. తప్పకుండా ఇదొక అద్భుత పోరుగా నిలుస్తుంది’’ అని కైఫ్‌ పేర్కొన్నాడు. 

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే ‘‘కేఎల్ రాహుల్, డికాక్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. లఖ్‌నవూ మిగతా బ్యాటర్లూ ఫర్వాలేదు. బెంగళూరులో మ్యాక్స్‌వెల్‌ భారీ ఇన్నింగ్స్‌లను ఆడాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌ ఫామ్‌ను కొనసాగించాలి. అందుకే బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా చూస్తే లఖ్‌నవూకే బెంగళూరు కంటే 60-40 ఎడ్జ్‌ ఉందనిపిస్తోంది. కీలకమైన పోరులో కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాలని, ఒత్తిడికి లోను కాకూడదని మాత్రమే సూచిస్తా. రాహుల్‌కు అసలైన పరీక్ష ఇవాళే ఉంటుంది. ఒత్తిడినంతా ఒక్కడే తీసుకోకుండా డికాక్‌కు షాట్లు ఆడేందుకు అవకాశం ఇవ్వాలి’’ అని మహమ్మద్ కైఫ్‌ వివరించాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోతే నిబంధనల ప్రకారం లీగ్‌ దశలో ఎక్కువ విజయాలు నమోదు చేసిన లఖ్‌నవూనే విజేతగా ప్రకటిస్తారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని