Mohammad Kaif: హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీకి 100/100: మహ్మద్‌ కైఫ్

గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు 100కు 100 మార్కులిస్తానని అంటున్నాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌. ఈ సీజన్‌కు ముందు సుదీర్ఘకాలం ముంబయి...

Published : 24 May 2022 14:12 IST

(Photos: Hardik Pandya and Mohammad Kaif Instagram)

ఇంటర్నెట్‌డెస్క్: గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు 100కు 100 మార్కులిస్తానని అంటున్నాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌. ఈ సీజన్‌కు ముందు సుదీర్ఘకాలం ముంబయి జట్టులో కొనసాగిన అతడు ఆ జట్టు వదిలేయడంతో గుజరాత్‌ చేజిక్కించుకుంది. ఈ క్రమంలోనే అతడికి కెప్టెన్సీ కట్టబెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, దీనిపై చాలా మంది అది సరైన నిర్ణయం కాదని తొలుత భావించారు. కానీ, హార్దిక్‌ అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. లీగ్‌ దశలో గుజరాత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడి కెప్టెన్సీపై స్పందించిన కైఫ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘కెప్టెన్‌గా పాండ్యకు 100/100 మార్కులిస్తా. సారథిగా అతడు అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మైదానంలో మిడాఫ్‌లో నిల్చొని ఎప్పుడూ బౌలర్లతో మాట్లాడుతుంటాడు. మ్యాచ్‌లో బౌలర్లు ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు కెప్టెన్‌ పక్కనే ఉంటే ఏమైనా సలహాలు, సూచనలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. కెప్టెన్‌, బౌలర్ల మధ్య సమన్వయ లోపం ఉండకూడదు. అలాగే ఆ జట్టు యాజమాన్యం కూడా ఆటగాళ్లను బాగా చూసుకుంది. నిజం చెప్పాలంటే మెగా వేలం జరిగాక పేపర్‌ మీద ఆ జట్టు అంత బలంగా కనపడలేదు. చాలా మంది ఇదే అనుకున్నారు. పాండ్య కొత్త కెప్టెన్‌ జట్టును ఎలా నడిపిస్తాడో అని సందేహించారు. కానీ, అతడు అద్భుతంగా నడిపించాడు’ అని కైఫ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని