Published : 17 Mar 2022 01:15 IST

Kaif : టీమ్‌ఇండియాపై మహమ్మద్‌ కైఫ్ ట్వీట్.. ట్రోల్‌ చేసిన నెటిజన్లు

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. భారత సారథి రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని టెస్టు జట్టు అద్భుతాలు చేస్తోందని కైఫ్ ట్వీట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమ్ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో మహమ్మద్‌ కైఫ్ ట్వీట్ చేస్తూ.. ‘‘ కేఎల్‌, రోహిత్, విరాట్, అయ్యర్, పంత్, జడేజా, యాష్, బుమ్రా, షమీ.. తుది జట్టు కోసం చాలా ఆప్షన్లు.. ఆకస్మాత్తుగా చూస్తే అంతా బాగానే ఉంది. రోహిత్-ద్రవిడ్ నేతృత్వంలో అత్యుత్తమ టెస్టు జట్టుగా రూపాంతరం చెందుతోంది’’ అని పోస్ట్‌ చేశాడు. దీనిపై విమర్శలు గుప్పించిన నెటిజన్లు.. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ శ్రమను తక్కువగా చేయడం సరికాదని కామెంట్లు చేశారు. వాటిల్లో కొన్ని..

‘స్వదేశంలో కాదు.. అసలైన పరీక్ష విదేశీ పిచ్‌లపై ఉంటుంది.. అక్కడ నాయకత్వం నిరూపించుకోవాలి’

‘బౌలింగ్‌ దళం పటిష్ఠంగా మారేందుకు గతంలోనే కోహ్లీ, రవిశాస్త్రి ఎంతో కృషి చేశారు’

‘ఇదే టీమ్‌ విరాట్ నాయకత్వంలోనూ అద్భుతంగా ఆడింది. ఎన్నో విజయాలను నమోదు చేసింది. అయితే పుజారా/రహానెలను తప్పించలేకపోవడం, అశ్విన్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం తప్పితే విరాట్-రవిశాస్త్రి జట్టును బాగా తయారు చేశారు’’

‘విరాట్-రవిశాస్త్రి టైమ్‌లోనే జట్టుకు ఓ రూపం వచ్చింది. ఇది కోహ్లీ టీమ్‌. ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న భారత్‌ను టాప్‌లోకి తీసుకొచ్చాడు’








Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని