Surya kumar yadav: సూర్య.. నెం.4పై కర్చీఫ్‌ వేశాడు.. ఇప్పట్లో కదలడు: కైఫ్‌

ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌పై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు కురిపించాడు.

Published : 30 Sep 2022 01:11 IST

దిల్లీ: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధశతకంతో చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ స్టార్‌ బ్యాటర్‌ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లగలడని అన్నాడు.జట్టులో నాలుగో స్థానం అతడి దేనని చెప్పాడు.

‘‘వచ్చేది టాప్‌ స్పిన్నరా.. పేసరా అవసరం లేదు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలమా? బ్యాటింగ్‌కు అనుకూలమా? అనేది సంబంధం లేదు. పిచ్‌ ఎంత కఠినంగా ఉన్నా ఫరవాలేదు. ఇవేవీ సూర్యను ఇబ్బందిపెట్టలేవు. అతడు ఆరెంజ్‌ క్యాప్‌ను పొందలేకపోవచ్చు. కానీ, మ్యాచులను గెలిపించగలడు. నాలుగో  స్థానంపై అతడు కర్చీఫ్‌ వేశాడు. ఇప్పట్లో అక్కడి నుంచి కదిలే సమస్యే లేదు’’అంటూ మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. ఆస్ట్రేలియా టీ20లో 36 బంతుల్లో 69 పరుగులు చేసి బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్య.. సఫారీలతో టీ20లోనూ తన మార్కు ఆటతో ప్రశంసలందుకున్నాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ20 పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ సూర్యకుమార్‌ రెండో స్థానానికి ఎగబాకాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts